Magaverse: మెగా వర్స్… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?
- November 16, 2026 / 05:58 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హోస్ట్‌గా ఓ టాక్ షో త్వరలో రానున్న విషయం తెలిసిందే. చిరంజీవి కుమార్త సుస్మిత కొణిదల నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, నెట్‌ఫ్లిక్స్ కలసి రూపొందిస్తున్న ఈ టాక్ షోకి సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో చాలా వరకు ఈ టాక్ షో తొలి సీజన్లో ఎవరెవరు గెస్టులు వస్తారు అనే వివరాలే బయటకు వస్తున్నాయి.
Magaverse
ఆ లెక్కన ఇప్పటి వరకు వచ్చిన సమాచారాల ప్రకారం చూస్తే.. ఈ సారి కూడా చిరంజీవి అదరగొట్టేస్తారు అనిపిస్తోంది. ఎందుకంటే రాబోతున్న/ వచ్చిన గెస్టులు అలాంటి వారు మరి. టాక్ షోని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించక ముందే వచ్చిన లీక్.. బ్రహ్మానందం – సునీల్ – సత్య. మూడు తరకాల కమెడియన్స్ వచ్చి తెగ సందడి చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వత లోక నాయకుడు కమల్ హాసన్ ఎపిసోడ్‌ని షూట్ చేశారట.

ఈ క్రమంలో ఇద్దరి సుదీర్ఘ అనుభవాలు, స్నేహం గురించి మాట్లాడుకున్నారట. ఆ తర్వాత చిరంజీవి స్నేహితుడు, ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఎపిసోడ్ షూటింగ్ చేశారట. అందులో ఇద్దరి స్నేహబంధం గురించి, కుటుంబాల స్నేహం గురించి, తొలి రోజుల్లో పరిశ్రమ గురించి మాట్లాడుకున్నారట. ఇప్పుడు ‘స్పిరిట్’ టీమ్ ‘మెగావర్స్’ సెట్లో అడుగుపెడుతోందని చెబుతున్నారు. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోను అందులో చూడొచ్చు.

ఇక సీజన్ షో స్టాపర్‌గా మెగా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉండేలా చూసుకుంటున్నారు అని సమాచారం. నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ ఇందులో పాల్గొంటారట. నిజానికి ‘మెగావర్స్’ తొలి ఎపిసోడ్ దీపావళికి ఉంటుందని అందరూ భావించారు. కానీ నెట్‌ఫ్లిక్స్ టీమ్ వేరేగా ఆలోచించింది. తాజా సమాచారం ప్రకారం అయితే.. ‘మెగా వర్స్’ రాక డిసెంబరులోనే అంటున్నారు. త్వరలో సీజన్ ఫస్ట్ కాంబినేషన్ ప్రోమో రిలీజ్ చేస్తారని.. అందులో ఆరు ఎపిసోడ్ల కంటెంట్ ప్రోమో ఉంటుంది అని చెబుతున్నారు.
















