RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ ఫ్యాన్స్ కు మరో పరీక్ష..!

  • June 18, 2021 / 05:56 PM IST

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని ప్రేక్షకులంతా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం విడుదల డేట్ ను రెండు సార్లు ఛేంజ్ చేశారు. మొదట 2020 జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ చిత్రం హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లు గాయాలు పాలవ్వడంతో కొన్నాళ్ళ పాటు షూటింగ్ డిలే అయ్యింది. అటు తర్వాత 2021 జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

కానీ కరోనా లాక్ డౌన్ వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆ డేట్ కు కూడా ఈ చిత్రం విడుదల కాలేదు. ఇక మూడవసారి అక్టోబర్ 13న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఈసారి కూడా పోస్ట్ పోన్ అవక తప్పడం లేదు అని వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2022 వ సంవత్సరం ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వలేదు.

దీంతో ఈ వార్త నిజమా.. కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టు 15 వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుందని వినికిడి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15వ తేదీ లేదా 14వ తేదీ సాయంత్రం… ఓ టీజర్ ద్వారా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అప్పటివరకు ‘ఆర్.ఆర్.ఆర్’ ఫ్యాన్స్ కు ఇది సహనం తో కూడుకున్న పరీక్ష అనే చెప్పాలి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus