పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’ తొలిరోజే ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి చాలా మంది విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా పూరికి రాసిన ఓ లెటర్ హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఈ విధంగా ఉంది :
“పూరి… ముందుగా ఇలా మాట్లాడుతున్నందుకు ఐ యామ్ సారీ..
నేను నీ సినిమాలకు పెద్ద అభిమానిని
చాలా కాలంగా నేను ‘లైగర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మొదటి రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా చూడలేకపోయాను. మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.మా ఫ్రెండ్స్ అంతా ‘సినిమా బాలేదు, మీ వాడి పని అయిపోయింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్టు’ అంటూ రకరకాల విమర్శలు చేశారు. అవేమి నేను పట్టించుకోలేదు. అయినా సరే ఒక్క రివ్యూ కూడా చదవకుండా నేను ఆదివారం రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూశాను. నాతో పాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. నేను సినిమా ఫోకస్డ్ గా చూడాలి.. నీ సినిమాల్లో ఉండే ఫిలాసఫీ ని అర్ధం చేసుకోవాలి అనేది నా ప్రధాన ఉద్దేశం.అలానే వెళ్లాను.. సినిమా చూశాను. సినిమా ప్లాప్ అయినందుకు, ఫ్రెండ్స్ బాలేదు అన్నందుకు నేను ఏమాత్రం బాధపడలేదు. ఏ దర్శకుడికి అయినా హిట్స్ ప్లాప్స్ అనేవి కామన్.
కాకపోతే నేను బాధపడిందల్లా.. నాకు తెలిసిన పూరి మార్క్, నేను ఎంజాయ్ చేసే పూరి టేకింగ్.. ఈ సినిమాలో కనిపించలేదు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని ఎవరో బాలీవుడ్ డైరెక్టర్ రీమేక్ చేసి.. మళ్ళీ దాన్ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది సినిమా. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది పూరి?
‘గోలీమార్’ లో ఓ మంచి డైలాగ్ రాశావు. ’10 మందిని మోసం చేస్తే నువ్వు కనీసం బాగుపడతావ్, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంక నాకి పోతావ్’ అని..! నా కర్మ నువ్వు రాసిన డైలాగ్ నేను నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అర్జెంట్ గా నీ టీం ని మార్చెయ్యి. లేదు అంటే వాళ్ళను నిజాలు చెప్పమని చెప్పు.’అవును అంటే అవును.. కాదు అంటే కాదు… బాగుంటే బాగుంది అని బాలేదు అంటే బాలేదు అని చెప్పమను.
నీ సినిమాలు ప్లాప్ అయినా వాటికి, నీకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది పూరి. ‘లైగర్’ సినిమాకి అది దక్కలేదు అని నా బాధ. నువ్వు తీసిన ‘రోగ్’ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కలగలేదు. ‘లైగర్’ కి చాలా డిజప్పాయింట్ చేశావ్.
మొన్న సుకుమార్ తో కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం గురించి చాలా బాగా చెప్పావు.కాదు కాదు గొప్పగా చెప్పావు. కానీ నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తావు? నువ్వు ఇప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయావు తెలుసా? ఆ ‘పూరి కనెక్ట్స్’ నుండి బయటకు వచ్చి ఓ సినిమా తియ్యి. ఇది నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్.
మాకు నువ్వు ప్రతీసారి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వనవసరం లేదు. నాకు వింటేజ్ పూరిని చూపించు.కనీసం చూపించడానికి ట్రై చెయ్యి. ప్రతి సారి ‘ఇడియట్’ ‘పోకిరి’ అవసరం లేదు. కడుపు మండితే ‘బిజినెస్ మెన్’ సినిమా తీశాను అని చెప్పావు కదా.నాకు కడుపు మండి ఇలాంటి లెటర్ రాస్తున్నాను. ‘బిజినెస్ మెన్’ లాంటి సినిమా ఒకటి ఇవ్వు. ‘ఐ వాంట్ వింటేజ్ పూరి’ ” అంటూ అందులో పేర్కొన్నాడు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!