డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగస్టు 25న ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా చూడడానికి 10 కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మొదటి రీజన్ డౌట్ లేకుండా విజయ్ దేవరకొండనే..! విజయ్ గత సినిమాలు ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు పెద్దగా ఆడలేదు. పైగా అవి కంప్లీట్ గా విజయ్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ఫార్మాట్ లో ఉండే సినిమాలు. అయితే ఇప్పుడు విజయ్ చేసిన ‘లైగర్’ మాత్రం అతను మునుపెన్నడూ చేయని విధంగా ఉంది. ఈ సినిమా కోసం అతను సిక్స్ ప్యాక్ చేశాడు. మాస్ డాన్స్ లు వేశాడు.ఫైట్లు కూడా అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో నత్తితో బాధపడే వ్యక్తిగా కూడా అతను కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో ఓ కొత్త విజయ్ దేవరకొండ ను చూసే అవకాశం ఉంది అని ట్రైలర్ వంటివి భరోసా ఇచ్చాయి.
2) ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్టు కొట్టి తిరిగి ఫాంలోకి వచ్చాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అతని దర్శకత్వంలో రూపొందిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాతో అతను రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
3) కరణ్ జోహార్, పూరి, ఛార్మి,అపూర్వ మెహతా.. లు నిర్మాణ విలువలకి ఎక్కడా తగ్గలేదు అని విజువల్స్ చెబుతున్నాయి.
4) అనన్య పాండే తన గ్లామర్ తో అమితంగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ఈమె లుక్స్ బాగున్నాయి… పాత్ర కూడా బాగా పండితే టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టే.
5) ఈ చిత్రంలో రమ్యకృష్ణ తల్లి పాత్ర పోషించింది. ఆమె పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
6) ది గ్రేట్ మైక్ టైసన్ ‘లైగర్’ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ట్రైలర్ లో కూడా అతను హైలెట్ గా నిలిచాడు. అతని పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
7) ఈ చిత్రంలో ఫైట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. కెచా నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు రూపొందాయి. ముఖ్యంగా మెట్రో ఫైట్ సీన్ చాలా బాగా వచ్చింది అని వినికిడి.
8) సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుందని తెలుస్తుంది. మాస్ సన్నివేశాలకు అదిరిపోయే నేపధ్య సంగీతం అందించాడట.
9) చాలా కాలం తర్వాత అలీ కోసం ‘లైగర్’ లో మంచి పాత్ర డిజైన్ చేశాడట పూరి. అతని పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది అని సమాచారం.
10) అక్డీ పక్డీ అనే పాట విజువల్ గా ఆకట్టుకుంటుంది అని తెలుస్తుంది. ఈ మూవీలో విజయ్ డాన్స్ మూమెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. మిగిలిన పాటలు కూడా విజువల్ గా బాగుంటాయట.
Click Here For LIGER First Review