హీరో, విలన్ అన్నాక కచ్చితంగా కొట్టుకుంటారు. కానీ ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటే అది రొట్ట కొట్టుడు సినిమా అని ఇట్టే అనేస్తారు. ‘జల్సా’ లో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ తో చెప్పించినట్టు.. ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించడం’. సినిమాల్లో కూడా మనం కోరుకునేది అదే.హీరో విలన్ ను ఓడించాలి. అందుకు హీరో సూపర్ మెన్ అవ్వాల్సిన పనిలేదు. హీరో ఎన్నో కష్టాలు ఫేస్ చెయ్యాలి.. ఆ కష్టంలోనే రాడ్డు తేలిపోవాలి.. ఆ తర్వాత విలన్ పని పట్టాలి. ఇదే ఎలిమెంట్ ను స్పోర్ట్స్ నేపథ్యంలో కూడా చెప్పిన సినిమాలు అనేకం ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాక్సింగ్ నేపథ్యం అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఎన్ని హిట్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం :
1) తమ్ముడు :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్ ప్రసాద్ తెరకెక్కించాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమా. 1999 జూలై 15న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
2) శివాజీ :
రజనీకాంత్ నటించిన సినిమా కాదిది. శ్రీహరి హీరోగా 2000 వ సంవత్సరంలో ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కూడా శ్రీహరి బాక్సర్ గా కనిపిస్తాడు. కానీ సినిమా హిట్ అవ్వలేదు.
3) అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీ. 2003 లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
4) జై :
నవదీప్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. 2004 లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు.
5) తుంటరి :
నారా రోహిత్ హీరోగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీనే..! 2016 లో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
6) బాక్సర్ భైరవ :
‘ఈ నగరానికి ఏమైంది?’ ఫేమ్ సుశాంత్ ‘బాక్సర్ భైరవ’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
7) గురు :
వెంకటేష్ హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీనే..! 2017లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
8) సార్పట్ట :
ఆర్య హీరోగా నటించిన ఈ మూవీని పా రంజిత్ డైరెక్ట్ చేశాడు. ఇది బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీ. ఓటీటీలో రిలీజ్ అయ్యి ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంది.
9) గని :
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ నిరాశపరిచింది.
10) లైగర్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ కూడా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీనే..! ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.