మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!

‘వైజయంతి మూవీస్’ ఈ బ్యానర్ కు చాలా చరిత్ర ఉంది. ఈ బ్యానర్లో నటించని హీరోలు లేరు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో రూపొందే సినిమాల పై జనాల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పటికీ ఈ బ్యానర్ హవా కొనసాగుతుంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి దుల్కర్ వరకు ఈ బ్యానర్లో నటించని స్టార్లు లేరనడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఈ బ్యానర్ చూడని ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, హిట్లు లేవు. కొన్ని సినిమాలు అంచనాలు అందుకోకపోయినా రిలీజ్ కు ముందు అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అంత భారీతనం ఉంటుంది ఈ బ్యానర్ కు.! అయితే మీకు తెలుసా ఈ బ్యానర్ ద్వారా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారని? లేట్ చేయకుండా వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) దీప్తి భ‌ట్నాగ‌ర్ :

సౌందర్య లహరి అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ‘పెళ్లి సందడి’ మూవీని ‘వైజయంతి మూవీస్’ సంస్థ కో ప్రొడ్యూస్ చేసింది. కె.రాఘవేంద్ర రావు గారు దర్శకుడు.

2) మహేష్ బాబు :

‘రాజకుమారుడు’ చిత్రంతో మహేష్ ను లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ఇదే బ్యానర్లో ‘సైనికుడు’ ‘మహర్షి’ వంటి చిత్రాలు చేశాడు మహేష్.

3) ఎన్టీఆర్ :

నిజానికి ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’. కానీ ముందుగా సైన్ చేసి, మొదలుపెట్టింది ‘స్టూడెంట్ నెంబర్ 1’. దీనికి ‘వైజయంతి మూవీస్’ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. తర్వాత ఇదే బ్యానర్లో ‘కంత్రి’ ‘శక్తి’ వంటి సినిమాలు చేశాడు ఎన్టీఆర్.

4) అల్లు అర్జున్ :

‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు. ‘గంగోత్రి’ సినిమాకి ‘వైజయంతి మూవీస్’ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.

5) తారకరత్న :

‘ఒకటో నెంబర్’ కుర్రాడు చిత్రంతో ఇతన్ని లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ.

6) నారా రోహిత్ :

‘బాణం’ తో నారా రోహిత్ ను కూడా లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ.

7) విజయ్ దేవరకొండ :

‘నువ్విలా’ ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండకి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో లెంగ్త్ ఉన్న రోల్ ఇచ్చి లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ. తర్వాత అతను ఇదే బ్యానర్లో రూపొందిన ‘మహానటి’ లో కూడా నటించాడు.

8) దుల్కర్ సల్మాన్ :

మమ్ముట్టి కొడుకుని తెలుగులో ‘మహానటి’ తో లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ. ఈ మధ్యనే అతను ‘సీతా రామం’ కూడా చేశాడు.

9) మృణాల్ ఠాకూర్ :

‘సీతా రామం’ లో సీత అలియాస్ నూర్ జాన్. ఎంత బాగా చేసింది. ఈమెను తెలుగులో లాంచ్ చేసింది ‘వైజయంతి మూవీస్’ సంస్థ.

10) దీపికా పదుకోనె :

‘ప్రాజెక్ట్ కె’ చిత్రంతో తెలుగులో దీపిక ను లాంచ్ చేస్తుంది ‘వైజయంతి మూవీస్’ సంస్థ.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus