Hyper Aadi: హైపర్ ఆది చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు!

  • October 30, 2023 / 03:22 PM IST

బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళు చూస్తారు కాబట్టి షోస్ కచ్చితంగా సంస్కారవంతంగా, చూడచక్కని విధంగా ఉంటూ, నవ్వుకునే విధంగా ఉండాలి. కానీ ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోస్ హద్దులన్నీ దాటేస్తున్నాయి. స్టేజి మీద ముద్దులు పెట్టుకోవడం, రొమాన్స్ చెయ్యడం చాలా కామన్ అయిపోయింది. ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే పాపులార్ ఎంటర్టైన్మెంట్ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఈ మధ్య అలాగే తయారైంది.

ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించేవాడు. ఆ తర్వాత ఆయన ఈటీవీ కి దూరం అవ్వడం తో యాంకర్ రష్మీ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తుంది. ఇక హైపర్ ఆది చేసే కామెడీ ఈ షో కి హైలైట్ గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈరోజు జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో హైపర్ ఆది ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. ఆమె తన ప్రేయసి అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తాడు.

హైపర్ ఆది (Hyper Aadi) ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ వేదిక పై నాకు ఘోరమైన అవమానం జరిగింది. మన ప్రేమ ఏంటో నిరూపించడానికి అర్జెంటు గా ఎదో ఒకటి చేసేయాలి అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి హైపర్ ఆది బుగ్గ మీద ముద్దు పెట్టి అందరిని షాక్ కి గురి చేస్తుంది.

ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవ్వడం తో కుటుంబం మొత్తం చూసే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఏమిటి ఈ రచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి హైపర్ ఆడికి నిజంగానే కాబొయ్యే భార్యనా?, లేదా కేవలం స్కిట్ కోసం తీసుకొచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus