దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించింది. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది హన్సిక. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాలో తన అందచందాలతో యాపిల్ పిల్లగా యూత్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది. కెరీర్ లో అసాధారణ స్టార్ డమ్ చిక్కకపోయినా యాభై పైగా సినిమాల్లో నటించింది ఈ ఆపిల్ బ్యూటీ. తెలుగు-తమిళం-హిందీలో రాణించింది.
అందుకే ఆ మధ్య (Hansika) హన్సిక హా2003 సంవత్సరంలో హృతిక్ రోషన్ తో కోయి మిల్ గయా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన హన్సిక.. 2007లో అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాలో గ్లామర్ కిక్కిచ్చింది. అయితే ఈ నాలుగేళ్లలోనే ఆమె అందాలలో ఇంత మార్పు రావడానికి కారణం హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకోవడమే అని చెప్పుకున్నారు జనం.హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందనే టాక్ అయితే బలంగా వినిపించింది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తాజాగా ఈ ఇష్యూపై హన్సిక ఓపెన్ అయింది. తనపై వచ్చిన వచ్చిన ఆ ఆరోపణలు చాలా బాధ పెట్టాయని హన్సిక చెప్పింది. ఒకవేళ తాను గనక హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకొని ఉంటే ఇప్పటికీ తీసుకోవాలి కదా. పైగా మా అమ్మే ఈ ఇంజక్షన్స్ ఇప్పించిందనే పుకార్లు రావడం బాధపెట్టింది అని హన్సిక చెప్పింది. హన్సిక మోత్వాని మాట్లాడుతూ-సెలబ్రిటీల జీవితంలో ఇలాంటివి కొంత భాగం మాత్రమే. ఇలాంటివాటికి సిద్ధంగా ఉండాలి.
సోషల్ మీడియా ప్రజాదరణ పొందకముందే నాపై ఇలాంటి ప్రచారం జరిగింది కాబట్టి చాలా విషయాలు ఎవరికీ తెలియవు అని చెప్పింది. తన వివాహ సిరీస్ ప్రారంభమైనప్పుడు ఇలాంటి విషయాలన్నీ తిరిగి ప్రస్థావనకు వచ్చాయని ఈ షో ద్వారా అన్నిటికీ సమాధానాలు ఇవ్వగలిగామని హన్షిక వెల్లడించారు. మేము దేనినీ దాచాలని ప్రయత్నించడం లేదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఈ రోజు వరకు నేను ఇంజెక్షన్ తీసుకోలేను. నేను సూదులంటే భయపడి పచ్చబొట్టు వేయించుకోలేను. ఒక తల్లి తన బిడ్డపై ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తుంది అని బాధపడ్డారు హన్సిక.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!