The Story of a Beautiful Girl Review in Telugu: ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిహాల్ కోదాటి (Hero)
  • దృశిక చందర్ (Heroine)
  • భార్గవ పొలుదాసు తదితరులు.. (Cast)
  • రవిప్రకాశ్ బోడపాటి (Director)
  • ప్రసాద్ తిరువల్లూరి (Producer)
  • అర్వీజ్ (Music)
  • అమర్ దీప్ గుట్టల (Cinematography)
  • Release Date : మే 12, 2023

“ఎవరు, బటర్ ఫ్లై” చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహాల్ కోదాటి, “మనసాయ నమః”తో సెన్సేషనల్ అయిన దృశిక చందర్ జంటగా నటించిన చిత్రం “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్”. రవిప్రకాశ్ బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రైలర్ వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: రవి (నిహాల్) ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంట్, చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన చరిత్ర (దృశిక చందర్)తో సెటిల్ అవ్వాలనుకుంటాడు. కానీ.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన చరిత్ర మెల్లమెల్లగా రవిని ఎవాయిడ్ చేయడం మొదలెడుతుంది. కట్ చేస్తే.. చరిత్ర కనబడకుండాపోతుంది. ఆమె ఆచూకీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగుతుంది.

అసలు చరిత్రకు ఏమైంది? ఆమెకు ఎవరి వల్ల ప్రాణహాని ఉంది? అనే యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన ఆదిత్య (భార్గవ పోలుదాసు)కు కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. అవేంటి అనేది “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్” కథాంశం.

నటీనటుల పనితీరు: నిహాల్ ఇంకా నటుడిగా పరిణితి చెందాల్సి ఉంది. అతడిలో ఇంకా చిన్నతనం ఉంది. అందువల్ల మెచ్యూర్డ్ గా కనిపించడానికి చేసే ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ముఖ్యంగా.. కళ్ళతో పలికించాల్సిన చాలా ఎమోషన్స్ ను సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. దృశిక చందర్ మాత్రం తన పాత్రకు న్యాయం చేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆమె కళ్ళు ఆమెకు మరియు సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.

పోలీస్ ఆఫీసర్ గా నటించిన భార్గవ పోలుదాసు స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. సన్నివేశానికి మరియు క్యారెక్టర్ ఆర్క్ కు తగ్గట్లు నటించిన ఏకైక నటుడు ఈయనే అని చెప్పొచ్చు. ఇంకాస్త నీట్ గా అతడి పాత్రను ఎలివేయ్ చేయొచ్చు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా సినిమాటోగ్రాఫర్ అమర్ దీప్ ను మెచ్చుకోవాలి. చాలా లిమిటెడ్ లొకేషన్స్ లో ఎక్కడా రిపిటీషన్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు. అలాగే.. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ కూడా ఇచ్చాడు. అర్వీజ్ అందించిన పాటలు బాగున్నాయి కానీ.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపెట్టాడు ప్రేక్షకుల్ని. సన్నివేశానికి సంబంధం లేని టెక్నో ట్యూన్స్ తో ఊదరగొట్టాడు.

కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా దర్శకుడు రవిప్రకాశ్ చాలా పకడ్బంధీగా కథను రాసుకున్నాడు కానీ.. స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. అలాగే.. రవి-చరిత్రల నడుమ లవ్ & రొమాన్స్ కు ఒక జస్టిఫికేషన్ లేకుండాపోయింది. అలాగే.. క్లైమాక్స్ జస్టిఫికేషన్ ను కూడా ఏదో చుట్టేశాడు తప్ప.. ఎందుకు, ఏమిటి అనేది వివరించలేదు. కథకుడిగా మాత్రం పెద్దగా అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: ఒక కథ మొదలు ఎంత ముఖ్యమో.. ముగింపు కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గ్రహించడంలో “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్” బృందం ఫెయిల్ అయ్యింది. సరైన క్యారెక్టర్ ఆర్క్స్ & స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus