Movies: కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

  • May 10, 2023 / 02:27 PM IST

‘ది కేరళ స్టోరీ’ మే 07 న రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ బాలీవుడ్ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించాడు. ఈ చిత్రాన్ని సౌత్ లో పలు చోట్ల బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ బుకింగ్స్ కూడా జరగకుండా… బుకింగ్స్ బ్లాక్ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు వెర్షన్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి.. ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది తెలీదు. ఈ చిత్రంలో హింసని, లైం*క దాడులను చాలా ఘోరంగా చూపించారు, అసలు ఇలాంటి సినిమాకి సెన్సార్ ఎలా చేశారు? అంటూ అంతా షాకవుతున్నారు.

ఇలాంటి సినిమా (Movies) రిలీజ్ అవ్వడం వల్ల గొడవలు పెరగడం గ్యారెంటీ అంటూ సంచలన కామెంట్లు ఈ సినిమా గురించి వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఈ సినిమాకి మాత్రమే కాదు గతంలో కూడా పలు సినిమాలకు వచ్చింది. అవును గతంలో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)  ఉర్ఫ్ :

గతంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్ బ్యాన్ చేయడం జరిగింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం సృష్టించింది.

2) సిన్స్ :

ఈ చిత్రాన్ని కూడా విడుదల కాకుండా బ్యాన్ చేయడం జరిగింది. అందుకు ఇందులో ఉన్న అస్లీలత కారణమని చెప్పాలి.

3) పరంజియా :

ఈ చిత్రంలో కూడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని విడుదల ఆపేయమని ప్రభుత్వాలు స్టే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

4) పాంచ్ :

ఈ చిత్రంలో కూడా హింస ఎక్కువగా ఉందని ఇండియా వైడ్ బ్యాన్ చేయడం జరిగింది.

5) ది పింక్ మిర్రర్ :

ఇందులో ఇద్దరు మహిళలు స్వయంతృప్తి పొందడం, శృంగారంలో పాల్గొనడం వంటి సన్నివేశాలు యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని.. సినిమాని బ్యాన్ చేయడం జరిగింది.

7) ఫైర్ :

భర్తలతో విడిపోయి ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కూడా అప్పట్లో వివాదాలకు దారి తీయడంతో విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

8) ఫిరాక్ :

ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు వచ్చినా విడుదలకు ప్రభుత్వాలు అంగీకరించకుండా బ్యాన్ చేయడం జరిగింది.

9) బ్లాక్ ఫ్రైడే :

ఈ చిత్రంలో కూడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని విడుదలకు ప్రభుత్వం నిరాకరించడం జరిగింది.

10) బాండిట్ క్వీన్ :

బందిపోటు రాణి ఫూలన్ దేవి కధాంశంతో 1994లో రూపొందిన ఈ చిత్రం విడుదలను సైతం బ్యాన్ చేయడం జరిగింది.

11) హే రామ్ : కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీ విడుదలకు అప్పట్లో ఆటంకాలు ఏర్పడ్డాయి.

12) లక్ష్మీస్ ఎన్టీఆర్ :

2019 ఎలక్షన్స్ టైంలో ఈ మూవీని విడుదల చేయడం కరెక్ట్ కాదని తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయడం జరిగింది.

13) ఆమె(ఆడై) :

అమలాపాల్ నటించిన ఈ మూవీలో ఆమె బట్టలు లేకుండా నటించడం పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈ చిత్రం విడుదలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus