ఇటీవల వచ్చిన ‘జైలర్’ లో హీరోగా నటించాడు ధ్యాన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్పేది.. రజనీకాంత్ జైలర్ గురించి కాదు. మలయాళంలో కూడా ‘జైలర్’ అనే సినిమా వచ్చింది. అందులో హీరోగా నటించిన ధ్యాన్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు రివీల్ చేశాడు ధ్యాన్. అతను మాట్లాడుతూ.. ‘మా నాన్నగారు శ్రీనివాసన్ దర్శకులు, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించారు.
దీంతో జనాలు నన్ను ‘నెపో’ కిడ్ అని పిలిచేవారు. కాలేజీ రోజుల్లో నేను డ్రగ్స్, మద్యానికి బానిసయ్యాను.డే అండ్ అండ్ నైట్ ఫుల్ గా తాగేవాడిని. అలా కొన్నాళ్ల పాటు తాగుతూనే ఉన్నాను. తాగి ఇంటికి వెళ్తే మా అమ్మ ఓ రేంజ్లో తిట్టేది. ఆ టైంలో నేను అర్పిత అనే అమ్మాయితో ప్రేమలో ఉండేవాడిని కూడా! మా నాన్న చాలా సంపాదించాడు, అలాంటప్పుడు నేను పని చేయాల్సిన అవసరమేముంది, కేవలం దాన్ని ఖర్చు పెట్టే బాధ్యత తీసుకుంటే చాలు అంటూ ప్రవర్తించేవాడిని.
కన్నతండ్రి అని కూడా చూడకుండా మా నాన్న గారిని బూతులు తిట్టేవాడిని. ఒకసారైతే ఆయన నన్ను ఇంట్లో నుండి గెంటేశారు. ఆ విషయం నాకు డ్రైవర్ చెబితే తప్ప నాకు తెలీదు, అంతలా మత్తులో ఉండేవాడిని. నాకు పేకాట కూడా అలవాటుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి 9 గంటలకు నేను ఫుల్లుగా తాగేసి పేకాట ఆడాను.
అర్పిత నాకు (Actor) ఫోన్ చేసి ఇంటికి వెళ్తున్నావా? లేదా? అని హెచ్చరించింది. మేము 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కాబట్టి ఇదొక ఈవెంట్ అని లైట్ తీసుకున్నాను. తెల్లవారుజామున 3 గంటలకు నేను ఇంటికి వెళ్ళాను. స్నానం చేశాక కూడా నేను మళ్ళీ మందు తాగాను. పెళ్లయ్యాక కూడా తాగాను. కానీ నాకు కూతురు పుట్టాక ఈ అలవాట్లు మానేసాను’ అంటూ ధ్యాన్.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!