Sangeeth Shoban: మ్యాడ్ హీరో సంగీత్ కు ఆ స్టార్ హీరో ఇంత అన్యాయం చేశాడా..!

  • October 10, 2023 / 06:05 PM IST

రీసెంట్ సమయం లో టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ‘మాడ్’. నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు కమెడియన్ గా నటించిన సంగీత్ శోభన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరీ కుర్రాడు, ఇంత బాగా నటించాడు, కామెడీ టైమింగ్ అదిరిపోయిందే, ఇంత కాలం ఎక్కడ ఉన్నాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

కానీ ఇంతకు ముందు సంగీత్ శోభన్ చాలా సినిమాల్లో నటించాడు. ‘బేకర్స్ & బ్యూటీ’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ , ‘ప్రేమ విమానం’ , ‘పిట్ట కథలు’ ఇంతకు ముందు ఈయన నటించినబా సినిమాలు. వీటిల్లో ఎక్కువ శాతం డైరెక్ట్ ఓటీటీ లో విడుదల అయ్యినవే. ఇకపోతే ఇతను ప్రముఖ డైరెక్టర్ శోభన్ కొడుకు. శోభన్ ప్రభాస్ తో వర్షం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసాడు.

ఇక సంగీత్ శోభన్ అన్నయ్య సంతోష్ శోభన్ ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో గా, మంచి డిమాండ్ తో కొనసాగుతున్నాడు. అయితే ప్రభాస్ మొదటి నుండి శోభన్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయనకీ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపడేలా చేసాడు కాబట్టి. అందుకే ఆయన కొడుకు సంతోష్ శోభన్ ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెడితే ప్రభాస్ తన వైపు నుండి నూటికి నూరు శాతం సపోర్టు చేసాడు.

దాదాపుగా సంతోష్ శోభన్ (Sangeeth Shoban) ప్రతీ సినిమాని ప్రభాస్ ప్రమోట్ చేసాడు. కానీ ఆయన తమ్ముడు సంగీత్ ని మాత్రం ప్రమోట్ చెయ్యలేదు. ఇప్పుడు మాడ్ చిత్రం విడుదల అవుతుంటే కనీసం ప్రభాస్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యార్ధకం. అన్నయ్య కి ఏమో అంత సహాయం చేసి, తమ్ముడిని ఇలా అన్యాయంగా వదిలేసావు ఏమిటి అన్నా అంటూ ప్రభాస్ పై సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus