SSMB28: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి అలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారా?

  • May 15, 2023 / 08:02 PM IST

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా ఈ సినిమాలు మరీ సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కాగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ప్రచారం కాని స్థాయిలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ టైటిల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపించాయి.

అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ కు సంబంధించి మరికొన్ని కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. గుంటూరు సెంటిమెంట్ తో ఈ సినిమా టైటిల్ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు అబ్బాయి, గుంటూరు మిర్చి ఇలాంటి టైటిల్స్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. టైటిల్ లో గుంటూరు పక్కాగా ఉండనుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబును స్టైలిష్ గా చూపించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.

మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా (SSMB28) ఈ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఆ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus