తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఓ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ దశలో వరుస ప్లాపులు వస్తున్న టైంలో ‘ఆకాశమే నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలతో హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ‘విక్రమ్’ (Vikram) కూడా సూర్య రేంజ్ ని గుర్తు చేసింది. అందులో చేసిన రోలెక్స్ పాత్ర సూర్య అభిమానులను విశేషంగా అలరించింది. అయితే ‘ఈటి’ ‘కంగువా’ (Kanguva) వంటి సినిమాలు మళ్ళీ డిజప్పాయింట్ చేశాయి. దీంతో ఓ హిట్టు కొట్టాలని ‘రెట్రో’ తో వస్తున్నాడు.
దీని ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. కానీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) సినిమాలో ఎంతో కొంత విషయం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. మరి వారి నమ్మకం ఎంత బలమైందో మే 1న తెలుస్తుంది. ఇక ‘రెట్రో’ (Retro) తర్వాత సూర్య ఓ స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఆ వెంటనే సెట్స్ పైకి కూడా వెళ్లనుంది. ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ అనుకుంటున్నారట.
`796 CC` అనే టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారట. ఈ సినిమా కథ మారుతి (Maruthi Dasari) కార్లు భారతదేశానికి దిగుమతి అవుతున్న రోజుల నేపథ్యంలో సాగుతుందట. అందుకే వాటి ఇంజిన్ కెపాసిటీ గుర్తుచేసే విధంగా `796 CC`టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.