తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తండ్రయ్యాడు. అతని సతీమణి గుత్తా జ్వాల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరి 4వ పెళ్లి రోజు నాడు పాప పుట్టినట్టు ఈ దంపతులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ఆ దేవుడు పాపను… తమని ఆశీర్వదించి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నట్టు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు విష్ణు విశాల్, గుత్తా జ్వాల. అలాగే వీరిది ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఆర్యన్.
మా ‘ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు’ అని కూడా తమ పోస్టులో పేర్కొన్నారు.దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకు ‘కంగ్రాట్యులేషన్స్’ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు నెటిజన్లు. 2021 లో విష్ణు విశాల్, గుత్తా జ్వాల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు డేటింగ్ అనంతరం వీరు ప్రైవేట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరికీ కూడా గతంలో వేరే వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి. విష్ణు విశాల్ 2010 లో రజిని నటరాజ్ ను పెళ్లి చేసుకున్నాడు.
కొన్నాళ్ళు వీళ్ళు బాగానే కలిసున్నారు. కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో 2018 లో విడాకులు తీసుకున్నారు. ఇక గుత్తా జ్వాల కూడా చేతన్ ఆనంద్ అనే తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ ని ప్రేమించి పెళ్లాడింది. 2005 జూలై 17న పెళ్లి చేసుకున్న వీరు.. 2011 జూన్ 29న విడాకులు తీసుకున్నారు. 2014 లో విష్ణు విశాల్, గుత్తా జ్వాల మధ్య ప్రేమ పుట్టింది. కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత వీళ్ళు పెళ్లి బంధంతో ఒకటైనట్టు తెలుస్తుంది.