మహిళ వాడిన ఆ ఫోటో ఏ స్టార్ హీరోయిన్‌దో తెలుసా!

రోజులు మారుతున్నా.. టెక్నాలజీ, చట్టాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కానీ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ఓ మహిళ.. హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటోతో ఓ యువకుణ్ణి మోసం చేసింది. కీర్తి సురేష్ అంటే ఎలా నమ్మేశాడో కానీ నిండా మునిగిపోయాడు.. ఈ వార్త విని నవ్వాలో, ఏడవాలో అర్థం కాక నెట్టింట నానా హంగామా చేస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన ఓ 40 సంవత్సరాల మహిళ పాపులర్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ ఫోటోతో ఓ యువకుడిని బురిడీ కొట్టించింది..

కీర్తి ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని తనే కీర్తి అని నమ్మించింది.. అంతేకాదు.. తానింకా కాలేజీలో చదువుతున్నట్టుగా నమ్మించింది.. అవసరం ఉందంటూ.. రూ. 40 లక్షలు సాయం చేయమని అడిగింది.. దీంతో అప్పుచేసి మరీ ఆమె అడిగిన డబ్బు ఇచ్చాడట.. కట్ చేస్తే అప్పటినుండి అడ్రస్ లేదు.. దీంతో మోసపోయానని గ్రహించాడు..‘‘తన వయసు 40 కాబట్టి.. 40 లక్షలు అడిగింది.. ఆ నంబర్‌తో తాను ఆంటీ అనే హింట్ ఇచ్చింది.. పాపం పిచ్చోడికి అర్థం కాలేదు.. అప్పుచేసి మరీ ఇచ్చాడట పాపం పిచ్చి ప్రేమికుడు..

అసలు నీ కలర్ ఏంటి?.. కీర్తి కలర్ ఏంటి?.. అయినా ఈరోజుల్లో కీర్తి సురేష్ తెలియని వాళ్లు ఎవరుంటారు?.. మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది.. ఏదో నార్త్ సైడ్ అంటే.. సరే హిందీ వాళ్లకి ఆమె తెలియదు అనుకోవచ్చు.. సో, కీర్తి నువ్వు కన్నడలో కూడా సినిమాలు చేయాల్సిందే.. గుర్తింపు తెచ్చుకోవాల్సిందే’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని ఒక సీన్‌కి సంబంధించిన ఇమేజ్ వాడుతూ..

‘‘వీడికి కీర్తి సురేష్ ఎలా ఉంటదో తెలియదు సార్’’ అంటూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.. ‘‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని.. వరుసగా అరడజను లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి.. పవన్, మహేష్ బాబు అలాగే తమిళనాట విక్రమ్, విజయ్ లాంటి స్టార్లతో జతకట్టిన కీర్తి సురేష్ ఫోటో వాడింది అంటే నిజంగా ఆ మహిళకి ఎంత ధైర్యం ఉండాలి’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus