ప్రభాస్, నయనతార, త్రిషా, ఐశ్వర్య రాయ్, కంగనా…ల పాస్ పోర్ట్, ఆధార్ కార్డు ఫోటోలను చూసారా?

  • December 25, 2020 / 07:38 AM IST

నిజజీవితంలో ఫోటోలకు, అలాగే ఆధార్ కార్డు ఫోటోలకు అస్సలు సంబంధం ఉండదు. అందుకే సోషల్ మీడియాలో వీటి పై చాలా మీమ్స్ మరియు జోక్స్ వస్తుంటాయి. నిజానికి ఆ ఫోటోలను మనమే రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడము. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మొన్నటికి మొన్న ఫేస్ యాప్ ద్వారా మన స్టార్ హీరోలను వృద్ధ వయసులో చూపించి షాక్ ఇచ్చారు మన నెటిజన్లు. అక్కడితో ఆగలేదు వాళ్ళు అమ్మాయిలుగా మారితే ఎలా ఉంటారు అనేది కూడా చూపించి రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు మన స్టార్ హీరోయిన్లను సైతం అబ్బాయిలుగా మారితే ఎలా ఉంటారో కూడా ప్రెజెంట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

మరి ఆ యాప్ నే ఉపయోగించారో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఏకంగా మన స్టార్స్ ను ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ లను కూడా ప్రేక్షకులకు ప్రెజెంట్ చేశారు. ప్రభాస్, ఐశ్వర్య రాయ్, నయనతార, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ల వింటేజ్ పిక్స్ ను తీసుకుని వారి పాస్ పోర్ట్, ఆధార్ కార్డుల్లా మార్చేశారు. చూసినవాళ్లకు ఇవి నిజంగా ఒరిజినల్సే అని ఆశ్చర్యపడేలా.. ఇవి ఉండడం గమనార్హం. ఈ లిస్ట్ లో ప్రభాస్, ఐశ్వర్య రాయ్, నయనతారలతో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఓ లుక్కెయ్యండి :

1)ప్రభాస్ :

‘బాహుబలి'(సిరీస్) తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆధార్ కార్డుని చూడండి. ఇందులో ప్రభాస్ ఫోటో ఏమాత్రం బాలేదు.ఒరిజినల్ ఆధార్ కార్డు ఫీల్ రప్పించడం కోసం ఇలా ప్రభాస్ ఫోటోని మార్ఫింగ్ చేసినట్టు ఉన్నారు.

2)రితేష్ దేశ్ ముఖ్ :

ఇతను బాలీవుడ్ నటుడే అయినప్పటికీ.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా భర్త కాబట్టి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇతని ఆధార్ కార్డు ఎలా ఉందో మీరే ఓ లుక్కెయ్యండి. ఒరిజినల్ కాదు సుమీ..!

3)కరెంజిత్ కౌర్ :

తెలుసు కదా సన్నీ లియోన్ అసలు పేరు ఇదే..! ఈమె పాస్ పోర్ట్ ను ఎలా ప్రెజెంట్ చేసారో చూడండి..!

4)త్రిష :

తమిళ, తెలుగు భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న మన త్రిష పాస్ పోర్ట్ ను మీరు కూడా చూడండి..!

5)ఐశ్వర్య రాయ్ :

అందం అంటే ముందు గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పాస్ పోర్ట్ ఫోటో ఇలా ఉందట.

6)కంగనా రనౌత్ :

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు ఫైర్ బ్రాండ్ అయిన కంగనా.. పాస్ పోర్ట్ ఫోటో ఎలా ఉందో చూడండి.

7) షారుఖ్ ఖాన్ :

మన బాలీవుడ్ బాద్ షా కు కూడా పాస్ పోర్ట్ చేసేసారు మనవాళ్ళు. అది ఎలా ఉందో మీరే చూడండి.

8)నయన తార :

తమిళ, తెలుగు భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న మన నయనతార పాస్ పోర్ట్ కూడా ఇదిగో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus