కోలీవుడ్ అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి బిజీ ఆర్టిస్ట్ గా మారారు. హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విలన్ పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సరికొత్త కథలను ఎన్నుకుంటూ హిట్ మీద హిట్ అందుకుంటున్నాడు. లుక్ తో సంబంధం లేకుండా నటనలో వైవిధ్యం చూపుతూ ఆకట్టుకుంటున్నాడు. ఒక్క తమిళ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అతడికి క్రేజ్ ఉంది. తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ లాంటి చిత్రాల్లో నటించాడు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో కూడా విలన్ పాత్రకు విజయ్ సేతుపతినే తీసుకోవాలని భావించారు. కానీ కుదరలేదు. తాజాగా ఈ హీరో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను వదులుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయాల్సివుంది. ఆ పాత్ర పేరు బుప్పా. ఈ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి బరువు తగ్గి లుక్ మార్చుకోవాల్సి ఉందట. ఈ మేరకు చిత్ర దర్శకనిర్మాతలకు విజయ్ హామీ కూడా ఇచ్చాడు.
తీరా షూటింగ్ చేయాల్సిన సమయానికి చూస్తే విజయ్ లుక్ ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పటిలానే పాత లుక్ లోనే తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. తన సినిమాల మేకింగ్ విషయంలో కేర్ తీసుకునే ఆమిర్ కి ఇది నచ్చక విజయ్ సేతుపతికి బదులు మరొకరిని తీసుకుందామని నిర్మాతలకు చెప్పేశాడట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో విజయ్ నటించడానికి ఆసక్తి చూపకపోవడం అర్ధంకాని ప్రశ్న!
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!