Abbas: ఆ యాడ్ చేయడం వల్ల నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నాకేం బాధ లేదు!

  • August 5, 2023 / 07:03 PM IST

ప్రేమదేశం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అబ్బాస్.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో బిజీగా మారిపోయారు. అయితే ఉన్నఫలంగా అబ్బాస్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈయన ఇండస్ట్రీకి దూరం అవుతూ కుటుంబ పోషణ కోసం ఎన్నో పనులు చేశానని తెలియజేశారు.ఇకపోతే ఈయన తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అబ్బాస్ మాట్లాడుతూ తన కెరియర్ పట్ల ఎన్నో విషయాలను తెలియజేశారు ముఖ్యంగా తాను నటించినటువంటి హార్పిక్ యాడ్ వీడియో గురించి ఈయన ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈ యాడ్ చేసిన సమయంలో చాలామంది తనపై విమర్శలు చేశారని తెలిపారు. అయితే వారు చేసిన విమర్శల వల్ల తాను ఏమీ బాధపడలేదని తెలిపారు.

తాను ఈ యాడ్ చేసినది టాయిలెట్ శుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రతను పాటించాలని చెబుతూ చేశానని తెలిపారు కానీ నాపై చాలామంది విమర్శలు కురిపించారు. అయితే ఆ సమయంలో నేను నా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఇలాంటి సమయంలోనే నాకు ఈ యాడ్ చేసే అవకాశం వచ్చింది వారు దాదాపు 8 సంవత్సరాల పాటు నాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇలా వారు ఇచ్చిన డబ్బుతోనే నా ఫ్యామిలీనీ పోషించుకున్నానని ఈయన తెలిపారు.

ఇలా తన కుటుంబ సభ్యులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి తరుణంలోని తనకు ఈ యాడ్ చేసే అవకాశం వచ్చిందని అందుకే తాను ఈ యాడ్ చేశాను అంటూ ఈ సందర్భంగా తన పట్ల వచ్చినటువంటి ట్రోల్స్ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అబ్బాస్ ఇన్ని రోజులు విదేశాలలో స్థిరపడగా తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఈయన ఇండియాలోనే ఉంటున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags