Vijay Devarakonda: మంచి చేస్తున్నా.. విజయ్ దేవరకొండకి అవమానాలు తప్పడం లేదు.. ఎందుకిలా..!

విజయ్ దేవరకొండ 5 ఏళ్ళ తర్వాత ‘ఖుషి’ తో సక్సెస్ అందుకుని ఊపిరి పీల్చుకున్నాడు. గత వారం రిలీజ్ అయిన ‘ఖుషి’ హిట్ అయ్యింది. సో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఆంధ్రాలో ఈ సినిమాను కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా వైజాగ్ లో జరిగిన ‘ఖుషి’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ.. తన అభిమానుల్లో ఉన్న పేద కుటుంబాలకు ‘ఖుషి’ సినిమా తరఫున కోటి రూపాయలు అందిస్తానని. ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున .. వంద కుటుంబాలకు కలుపుకుని కోటి రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్నానని… విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. తన సినిమా సక్సెస్ ను ఈ రకంగా తనని అభిమానించే వారితో సెలబ్రేట్ చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఆశపడ్డాడు.

అయితే విజయ్ కి అభిషేక్ పిక్చర్స్ వారు పెద్ద షాకిచ్చారు. ‘మీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా వల్ల మేము రూ.8 కోట్లు నష్టపోయాం. ఆ టైంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. మీ పెద్ద మనసు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పై కూడా చూపాలని’ విజయ్ దేవరకొండని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ వారి ఎమోషన్ కరెక్టే కావచ్చు. కానీ ఆ సినిమాకి విజయ్ దేవరకొండ ఎంత చేయాలో అంతా చేశాడు. ఆ సినిమాని ఎక్కువ రేట్లకు అమ్మడం, ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయడం అనేది నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన విషయం. ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి లాభాలు వచ్చినట్టు అయితే కనుక..

విజయ్ కి అభిషేక్ పిక్చర్స్ వారు కానీ మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ లాభాల్లో వాటా ఇచ్చేవారు కూడా కాదు కదా. విజయ్ తన సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటే ఇలా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ వంటి బడా స్టార్లు విజయ్ లా చేసుంటే వాళ్ళని నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇలా ప్రశ్నిస్తారా? విజయ్ దేవరకొండ సాఫ్ట్ కార్నర్ గా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదేమో.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus