బిగ్‌బాస్‌4: అభి లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలంటే…!

బిగ్‌బాస్‌ ఇంట్లో తన పని తాను చేసుకుంటూ పోతూ అందరితో సఖ్యతగా ఉండాలనుకుంటుంటాడు అభిజీత్‌. అందుకే ఇంటి సభ్యులు తమ వాడుగానే చూస్తారు. ఒకరిద్దరు తప్ప. అలాంటివాడికి ఇంట్లోని అమ్మాయిల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుంటే బాగుంటుంది కదా. నిన్న ఎపిసోడ్‌లో జరిగిన నైట్‌అవుట్‌ ఫర్‌ గాళ్స్‌లో అదే జరిగింది. పార్టీ మొదలయ్యాక అభిని పిలిచి అమ్మాయిలు తమ గురించి చెప్పమన్నారు.

ఆరియానాను స్టన్నింగ్‌ అంటూ పొగిడేసిన అభిజీత్‌… లాస్యను బ్యూటిఫుల్‌ అంటూ చెట్టేక్కించేశాడు. నీ కళ్లలో అందం ఉంటుంది… కళ్ల జోడుతో చాలా బాగుంటావు అంటూ దివిని పొగిడాడు. ఆల్‌రౌండ్, ఫెంటాస్టిక్‌ మోనాల్‌ మీ అభిప్రాయం చెప్పాడు. ఇక తన బెస్ట్‌ ఫ్రెండ్‌ హారిక గురించి అయితే చాలానా వివరించాడు. క్యూటీ, గార్జియస్‌ అంటూ తన అభిమానం చాటుకున్నాడు. నియాన్‌ కలర్‌ టాప్‌లో చాలా బాగున్నావ్‌ అంటూ మెచ్చుకున్నాడు కూడా.

అభి మనసులో మాట అయ్యాక.. నీకెలాంటి అమ్మాయి నచ్చుతుంది అని ఇంట్లో అమ్మాయిలు అడిగారు. దానికి అభి ‘హానెస్టీగా ఉండాలి. లెవల్‌ హెడెడ్‌ అయి ఉండాలి. డెసిషన్‌ మేకింగ్‌లో క్లియర్‌గా ఉండాలి. ఎమోషన్స్‌, సెన్సిబిలిటీలను అర్థం చేసుకొని ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే అమ్మాయి అవ్వాలి’ అంటూ తన లైఫ్‌ పార్టనర్‌ గురించి చెప్పాడు అభిజీత్‌. మాలో ఎవరితో డేట్‌కి వెళ్తావ్‌ అని ఆరియానా అడిగితే.. నీతోనే అంటూ ఆమెను ఆనందంలో ముంచెత్తాడు.

ఆ తర్వాత అమ్మ రాజశేఖర్‌ గదిలోకి వచ్చి మాస్‌ పాటలతో డ్యాన్స్‌ వేసి అలరించాడు. సోహైల్‌ను అయితే అమ్మాయిలు ఓ ఆట ఆడుకున్నారు. లుంగీ లాగి మరీ ఏడిపించారు. అఖిల్‌తో ముగ్గులు పెట్టించి మరీ టీజ్‌ చేశారు. హారిక మామూలు అమ్మాయి కాదని… నామినేషన్‌ టైమ్‌లో, అవసరమైనప్పుడు గట్టిగా ఇచ్చిపడేస్తుందని చెప్పాడు సోహైల్‌. ఒక్కోసారి ‘ఏంది ఈ అమ్మాయి .. ఇంత పొగరేంది’ అనుకుంటాం అని కూడా చెప్పాడు. ఆడపిల్లకు ఆ మాత్రం పొగరు ఉండాలి లెండి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus