బిగ్ బాస్ 4: ఈవారం టాప్ లో ఉన్నారు..!

  • December 11, 2020 / 04:20 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం లెక్కలు మారిపోతున్నాయి. హౌస్ లో జరిగిన సంఘటనలని బట్టీ బయట ఓటింగ్ లెక్కలు తారుమారు అవుతున్నాయి. అప్పటి వరకూ టాప్ ప్లేస్ లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా కిందకి పడిపోతున్నారు. అలాగే డౌన్ లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా పైకి టాప్ లోకి వచ్చేస్తున్నారు.

ముఖ్యంగా సోహైల్ అండ్ అరియానాకి జరిగిన ఆర్గ్యూమెంట్ అనేది మిగతా వారి ఓటింగ్ లెక్కలని కూడా పూర్తిగా మార్చేసింది. ఈవారం 14వ వారం నామినేషన్స్ లో మనం చూసినట్లయితే 5గురు ఉన్నారు. అభిజిత్, సోహైల్, అరియానా, హారిక ఇంకా మోనాల్ లు ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ లో మాత్రం ఇద్దరు దూసుకువెళ్తున్నారు. శుక్రవారం లాస్ట్ డే ఓటింగ్ లో అభిజిత్ అండ్ హారిక ఇద్దరికీ హ్యూజ్ గా ఓటింగ్ జరుగుతోంది.

సోషల్ మీడియాలో పోలింగ్స్ లో ఎక్కడ చూసినా కూడా వీరిద్దరే రాకెట్స్ లాగా దూసుకువెళ్తున్నారు. ఈవారం టాప్ లో కూడా వీరిద్దరే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈసారి అరియానా, సోహైల్, మోనాల్ ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది జరగబోతోందని, అభిజిత్ ఇంకా హారిక ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్తున్నారు. బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఇప్పుడు రూట్ మార్చి వీరిద్దరికే ఓట్లు ఎక్కువగా వేస్తున్నారు. విన్నర్ ని డిసైడ్ చేసే వీక్స్ కావడంతో ఇప్పుడు రెచ్చిపోయి మరీ ఓటింగ్ చేస్తున్నారు. అదీ విషయం.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus