బిగ్ బాస్ 4: అభిజిత్ చెప్పిన శివగామి సెటైర్లు..!

బిగ్ బాస్ ఈసారి సీజన్ లో హౌస్ మేట్స్ కి ఒక అరుదైన అవకాశాన్ని కల్పించాడు. నేరుగా ప్రజలతో గోల్డెన్ మైక్ ద్వారా మాట్లాడుకునేందుకు టాస్క్ లని డిజైన్ చేశాడు. ఇందులో భాగంగా మొదటి టాస్క్ లో అరియానా గెలిస్తే, రెండో టాస్క్ లో సోహైల్ గెలిచాడు. ఫస్ట్ టాస్క్ రూలర్ లో అరియానా బెస్ట్ పెర్ఫామర్ గా ఎంపిక అయ్యింది. అంతేకాదు, అక్కడ ఓటింగ్ రిక్వస్ట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఓపిక టాస్క్ లో అరియానాకి కోపం తెప్పించేందుకు చేసిన ఏ పని కూడా వర్కౌట్ అవ్వలేదు. అక్కడే మోనాల్ తో, సోహైల్ తో అరియానాకి ఇష్యూ కూడా అయ్యింది.

ఇక మూడో టాస్క్ లో ఏకాగ్రతలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో హౌస్ మేట్స్ ఏకాగ్రతకి భంగం కలిగిస్తూ రకరకాల ప్రశ్నలు వేస్తూ సందడి చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఇక్కడే అభిజిత్ వేసిన పంచ్ అద్దిరిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పంచ్ ట్రోల్ అవుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో బాహుబలిలో శివగామి క్యారెక్టర్ ఎవరు అని హారిక అడిగింది. దీనికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు అభిజిత్. శివగామిలో ఉన్న అందం మోనాల్ దగ్గర ఉంది, శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాకి ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హారికలో ఉంది అని చెప్పాడు. ఈ పంచ్ కి హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మోనాల్ టైమ్ ని కౌంట్ చేస్తుంటే అభిజిత్ మౌంట్ ఎవరెస్ట్ ఏ కంట్రీలో ఉంది అని అడిగాడు. దీనికి మోనాల్ చైనా ఇంకా ఇండియా బోర్డర్ లో ఉందని చెప్పేసరికి కిందపడిపోయాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు, అభిజిత్ వేసిన పంచ్ డైలాగ్స్ ని ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. అదీ విషయం.

[yop_poll id=”1″]

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus