NTR30: ‘ఆచార్య’ ఎఫెక్టా.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఎఫెక్టా?

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యి ఏడాది కావస్తున్నా… ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీంతో అభిమానులు డీలా పడిపోయారు. ఎన్టీఆర్ వేరే హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తే తన 30 సినిమా అప్డేట్ గురించి అడుగుతూ గోల చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్రస్ట్రేట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొత్తానికి ఈరోజు ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఉన్న ఐటీసీ కోహినూర్ లో జరిగాయి.

ఇది ఒక ఫార్మల్ అండ్ నార్మల్ లాంచ్ మాత్రమే..! రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రం కథ గురించి ఆసక్తికర కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు. ఈ సినిమా కథ.. ‘ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్‌లో తెర‌కెక్క‌బోయే క‌థ‌. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ వాళ్లలో మృగాలు ఉంటారు. ఆ మృగాళ్ల‌కు భయమంటే ఏంటో తెలియదు. దేవుడంటే..చావంటే భయం లేదు.

కానీ వారంద‌రికీ ఉండే ఒకే ఒక భ‌యం ఉంటుంది. అదేంటో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది.భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా హీరో పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌. చాలా బిగ్‌ మూవీ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో ఇదే నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్‌ చేస్తున్నా’ అంటూ కొరటాల చెప్పుకొచ్చాడు. కొరటాల కామెంట్స్ కు మెగా అభిమానులు గట్టిగా సెటైర్లు వేస్తున్నారు.

ఓ రకంగా వాళ్ళు ఈ సినిమా పై పగబట్టేశారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ‘ఆచార్య’ ఫలితమే.. అనుకుంటే పొరపాటే. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కూడా ఓ కారణమని చెప్పాలి. ‘నాటు నాటు’ కి ఆస్కార్ వస్తే.. ఎన్టీఆర్ ఎక్కడా కూడా చరణ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. ఇక రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ సినిమా దారుణంగా ప్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది. దాన్ని కూడా గుర్తు చేస్తూ మెగా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus