టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

ఒక భాషకి చెందిన నటీనటులు ఇతర భాషల్లో నటించడం అనేది కామనే.. కానీ ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మరో పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమై గుర్తింపు తెచ్చుకోవడం.. లేదా హీరోతోనే, డైరెక్టర్‌తోనో వర్క్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.. రీమేక్స్ విషయంలో వేరే ఇండస్ట్రీకి షిఫ్ట్ అవడం మామూలే.. కె. బాల చందర్, భారతీ రాజా వంటి లెజెండరీ దర్శకులు కూడా తెలుగులో చిత్రాలు చేశారు..

కరుణాకరణ్ లాంటి వాళ్లు నేరుగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్థిరపడిపోతే.. కొందరు అడపా దడపా.. ఇంకొందరు ఒక సినిమా తీసిన వారూ ఉన్నారు.. స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ మూవీతో తెలుగు నాట అడుగు పెట్టగా.. ఇటీవల రామ్ పోతినేని ‘వారియర్’ తో లింగుస్వామి, ఇప్పుడు నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీతో వెంకట్ ప్రభు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.. తెలుగు పరిశ్రమలో చిత్రాలు చేసిన 10 మంది కోలీవుడ్‌ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) కె. బాల చందర్..

భలే కోడలు
సత్తె కాలపు సత్తెయ్య
బొమ్మా బొరుసా
ఆకలి రాజ్యం
అంతులేని కథ
మరో చరిత్ర
అందమైన అనుభవం
తొలి కోడి కూసింది
47 రోజులు
కోకిలమ్మ
రుద్రవీణ

2) భారతీ రాజా..

కొత్త జీవితాలు
సీతాకోక చిలుక
యువతరం పిలిచింది
ఆరాధన
జమదగ్ని..

3) కె.ఎస్. రవి కుమార్..

స్నేహం కోసం
బావ నచ్చాడు
విలన్
జై సింహా
రూలర్..

4) ఎ. కరుణాకరన్..

తొలిప్రేమ
యువకుడు
వాసు
బాలు
హ్యాపీ
ఉల్లాసంగా ఉత్సాహంగా
డార్లింగ్
ఎందుకంటే ప్రేమంట
చిన్నదాన నీకోసం
తేజ్ – ఐ లవ్ యూ..

5) ఎస్.జె. సూర్య..

ఖుషి
నాని
పులి (కొమరం పులి)..

6) శశి..

శీను – (బిచ్చగాడు ఫేమ్)..

7) ఎ.ఆర్. మురుగదాస్..

స్టాలిన్..

8) సముద్రఖని..

శంభో శివ శంభో
జెండాపై కపిరాజు
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ (షూటింగ్ దశలో ఉంది)..

9) విష్ణు వర్థన్..

పంజా..

10) మోహన్ రాజా..

హనుమాన్ జంక్షన్
ధృవ
గాడ్ ఫాదర్..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus