హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!

ఒక భాషకు చెందిన నటీనటులు ఇతర భాషల్లో నటించడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.. బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగతో పాటు తమిళంలో ఎక్కువగా కనిపిస్తుంటారు.. విలన్లను కూడా అక్కడి నుండే ఇంపోర్ట్ చేసుకునే వారు.. ఇప్పుడు యాక్టర్స్ క్రేజ్ బౌండరీస్ దాటుతున్నాయి.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పాన్ ఇండియాకే పరిమితమవడమే పాపులారిటీ అనుకుంటున్నారు చాలా మంది నటీనటలు.. అయితే గతంలోనే సీనియర్ నటులు కొందరు హాలీవుడ్‌లో నటించారు..

ఇప్పుడు ఇంగ్లీష్‌లో యాక్ట్ చేసిన ఇండియన్ యాక్టర్స్ అనగానే ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్, ధనుష్.. త్వరలో సమంత నటించబోతుంది అని చెప్తుంటారు కానీ వీరి కన్నా ముందే అక్కడ నటించి మెప్పించారు మన భారతీయ నటులు.. వాళ్లెవరు.. ఆ వివరాలేంటో చూద్దాం..

1) ఆలియా భట్ – హార్ట్ ఆఫ్ స్టోన్..

‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలింతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone) అనే స్పై థ్రిల్లర్‌లో యాక్ట్ చేసింది.. దీనిలో ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాడాట్ కూడా నటించింది..

2) సమంత – అరైంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్..

‘ది ఫ్యామిలీ మెన్ -2’ తో షాక్ ఇచ్చిన సమంత.. హాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ చేసుకుంది.. బై సెక్సువల్ స్పై నేపథ్యంలో సాగే ఈ మూవీలో సామ్ లీడ్ రోల్ చేస్తోంది.. దీంతో అమ్మడు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అనిపిస్తుంది..

3) ఐశ్వర్య రాయ్..

ఐశ్వర్య రాయ్ హాలీవుడ్‌లో ‘బ్రైడ్ & ప్రిజుడిస్’, ‘ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్’, ‘ప్రోవోకెడ్’, ‘ది లాస్ట్ లెజియన్’, ‘పింక్ పాంథర్ 2’ వంటి సినిమాల్లో నటించింది..

4) అమితాబ్ బచ్చన్..

లెజెండరీ యాక్టర్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ‘ది గ్రేట్ గాట్స్‌బై’ అనే ఇంగ్లీష్ మూవీలో యాక్ట్ చేశారు..

5) నసీరుద్దిన్ షా..

వెర్సటైల్ యాక్టర్ నసీరుద్దీన్ షా ‘ది పర్ఫెక్ట్ మర్డరర్’, ‘సచ్ ఏ లాంగ్ జర్నీ’, ‘ది లీగ్ ఆఫ్ ఎక్స్‌ట్రార్డినరీ జెంటిల్‌మెన్’, ‘ది గ్రేట్ న్యూ వండర్ ఫుల్’, ‘టుడేస్ స్పెషల్’, ‘ఫైండింగ్ ఫానీ’, ‘మ్యాంగో డ్రీమ్స్’ సినిమాలు చేశారు..

6) అనుపమ్ ఖేర్..

ఇండియాలోని బెస్ట్ యాక్టర్లలో ఒకరైన అనుపమ్ ఖేర్ కూడా.. ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’, ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ వంటి మూవీస్‌లో నటించారు..

7) ఇర్ఫాన్ ఖాన్..

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ‘ది నేమ్ సేక్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ది అమేజింగ్ స్పైడర్ మెన్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ వరల్డ్’ చిత్రాల్లో కనిపించారు..

8) ప్రియాంక చోప్రా..

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. తర్వాత ‘బేవాచ్’ మూవీతో పాటు పలు వాటిల్లో నటించింది..

9) టబు..

సీనియర్ నటి టబు ‘ది నేమ్ సేక్’, ‘లైఫ్ ఆఫ్ పై’ ఫిలింస్ చేసింది..

10) అమ్రిష్ పురి..

అమ్రిష్ పురి ‘ది ఇండియాజోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ (Indiana Jones and the Temple of Doom) మూవీలో మెయిన్ విలన్‌గా నటించారు..

11) రజినీ కాంత్..

సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘బ్లడ్ స్టోన్’ అనే ఆంగ్ల చిత్రంలో నటించారు..

12) దీపికా పదుకోన్..

దీపికా పదుకోన్ హాలీవుడ్‌లో ‘ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ లో కనిపించింది.. చేసింది ఒక్క సినిమానే అయినా కానీ అమ్మడు విన్ డీజిల్‌తో కలిసి మామూలు హంగామా చేయలేదు..

13) ధనుష్..

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’, ‘ది గ్రే మాన్’ మూవీస్‌తో ఆకట్టుకున్నాడు..

14) ఓం పురి..

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ఓం పురి.. ‘సామ్ & మి’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘వోల్ఫ్’, ‘ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్’, ‘ఎ మిలియన్ రివర్స్’ లాంటి 10కి పైగా సినిమాలు చేశారు..

15) అనిల్ కపూర్..

స్టార్ హీరో అనిల్ కపూర్.. ‘మిషన్ ఇంపాజిబుల్ – ఘోస్ట్ ప్రోటోకాల్’ లో కనిపించారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus