Naga Shaurya: నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

నాగ శౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం రేపు అనగా మార్చి 17న రిలీజ్ కాబోతుంది. గత 3,4 వారాలుగా బాక్సాఫీస్ వద్ద కాస్త పేరున్న సినిమా కనిపించింది లేదు. అసలే పరీక్షల సీజన్, పైగా ఇన్‌ఫ్లూఎంజా ఎఫెక్ట్ కూడా పడటంతో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. దీంతో ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల వల్ల కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్న థియేటర్లకు రెంట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఓ మంచి హిట్టు పడాలి.

ఈ క్రమంలో అందరి దృష్టి నాగ శౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం పైనే పడింది. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుండి వచ్చింది. అందువల్ల ఇది క్రేజీ ప్రాజెక్టు అయ్యింది. ఈ క్రమంలో నాగశౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

1) జ్యో అచ్యుతానంద :

నారా రోహిత్, నాగ శౌర్య .. హీరోలుగా నటించిన ఈ మూవీలో రెజీనా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ రూ.5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.8 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.

2) నీ జతలేక :

నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడటం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ కేవలం రూ.1.1 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

3) ఛలో :

నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.12.3 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4) కణం :

నాగ శౌర్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ రూ.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.1.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.

5) అమ్మమ్మగారిల్లు :

నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ కూడా అనేక సార్లు వాయిదా పడుతూ రావడంతో.. అంతగా క్యూరియాసిటీని క్రియేట్ చేయలేకపోయింది. రూ.3.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రూ.1.9 కోట్ల షేర్ ను రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

6) నర్తనశాల :

నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.0.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

7) అశ్వద్ధామ :

నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

8) వరుడు కావలెను :

నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.8.55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.5.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

9) లక్ష్య :

నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ 6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.2.06 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

10) కృష్ణ వ్రింద విహారి :

నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ 5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.0.50 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus