Acharya: ఆచార్య ప్రమోషన్స్ వెనుక స్ట్రాటజీ ఇదేనా!

Advertisement

చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఆచార్య సినిమాకు సంబంధించిన హైలెట్స్ ను రివీల్ చేసే విషయంలో మేకర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఆచార్య మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అన్నీ రివీల్ చేసేస్తే అంచనాలు భారీగా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆచార్య ట్రైలర్ లో సైతం చిరంజీవి కంటే చరణ్ కే ప్రాధాన్యత దక్కిందనే సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు హిట్టయ్యాయి. మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. చిరంజీవి చరణ్ ఒకే సాంగ్ లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆచార్యపై అంచనాలను తగ్గించడం మేకర్స్ స్ట్రాటజీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల కానుందని తెలుస్తోంది. ఆచార్య మూవీ బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా కాజల్ పాత్రకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. ఆచార్య విడుదలైన తర్వాత ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. చరణ్ ఖాతాలో ఈ మూవీతో మరో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read