తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!

  • April 15, 2022 / 05:36 PM IST

మన తెలుగు సినిమాల పై కూడా ఒక్కోసారి డబ్బింగ్ సినిమాల డామినేషన్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన హీరోలకి ఎలా అయితే పక్క రాష్ట్రాల్లో అభిమానులు ఉంటారో అలాగే మన రాష్ట్రంలో కూడా పొరుగు రాష్ట్రాల హీరోల సినిమాలకి అభిమానులు ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ తో వస్తే కనుక పక్క రాష్ట్రాల హీరోల సినిమాలనే ఎక్కువగా చూస్తుంటారు. అదే మన హీరోలు తీస్తే.. ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ లేవు అంటుంటారు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూసాం. ప్రయోగాలు అనేవి పక్క రాష్ట్రాల హీరోలు మాత్రమే చెయ్యాలి అప్పుడే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్స్ ను సాధిస్తాయి. లేదంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా..!

ఇదిలా ఉండగా.. ఒకప్పుడు రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి పొరుగు రాష్ట్రాల హీరోల సినిమాలకి మాత్రమే ఇక్కడ మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగేది. కానీ రాను రాను చాలా మంది హీరోలు ఇక్కడ మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. మన తెలుగు బయ్యర్స్ కూడా డబ్బింగ్ సినిమాల హక్కులని కొనుగోలు చేసి భారీ లాభాలను ఆర్జించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే వాళ్లకి వాటిపై మోజు మాత్రం పోవడం లేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే టాలీవుడ్లో ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాలు ఏవో..! టాప్ 10 లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) కె.జి.ఎఫ్ 2 :

‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ అనే కన్నడ డబ్బింగ్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ప్రశాంత్ నీల్- యష్ లను పాన్ ఇండియా స్టార్లను చేసింది. ఈ మూవీ తెలుగులో ఏకంగా రూ.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఇక్కడ హిట్ అనిపించుకోవాలి అంటే రూ.80 కోట్ల షేర్ ను రాబట్టాలి.

2)2.o :

రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో రోబోకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి ఏకంగా రూ.71 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.బయ్యర్స్ కు నష్టాల్నే మిగిల్చింది.

3) ఐ (మనోహరుడు) :

విక్రమ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఏకంగా రూ.39 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక్కడి బయ్యర్స్ కు నష్టాల్నే మిగిల్చింది.

4) కాలా :

రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీకి ఏకంగా రూ.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ 50 శాతం కూడా రికవరీ సాధించలేదు.

5) కబాలి :

రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీకి కూడా ఏకంగా రూ.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఇది ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించింది. ఫైనల్ గా నష్టాల్నే మిగిల్చినా… ‘కాలా’ తో పోలిస్తే పర్వాలేదు.

6) లింగ :

రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీకి కూడా ఏకంగా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ సగానికి సగం పైనే నష్టాల్ని మిగిల్చింది.

7) రోబో :

రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఇక్కడి బయ్యర్స్ కు భారీ లాభాల్ని అందించింది.

8) సింగం 3 :

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ సగానికి సగం నష్టాల్నే మిగిల్చింది.

9) సికిందర్ :

సూర్య – లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి తెలుగులో రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కూడా నష్టాల్నే మిగిల్చింది.

10) 24 :

సూర్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కొనుగోలు చేసిన తెలుగు బయ్యర్స్ బాగానే సేఫ్ అయ్యారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus