సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని వార్తల్లో నిలిచిన హీరోయిన్ల లిస్ట్..!

భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్ధతో పాటు అత్యంత కీలకమైంది వివాహం. సమాజాభివృద్ధికి మూలం వివాహ వ్యవస్థలోనే దాగుందని మన పెద్దలు చెబుతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి ధర్మబద్ధతను, సామాజిక గుర్తింపు ఇవ్వడానికి వివాహ వ్యవస్థను రూపొందించారు. నా కోసం నువ్వు, నీ కోసం నేను అనే భావను జీవితాంతం నిలిపి వుంచేలా పూర్వీకులు ఏర్పాట్లు చేశారు. నలుగురికి తెలిసేలా, ఘనంగా తమ పెళ్లి చేసుకోవాలని యువతీ యువకులు పెళ్లీడుకొచ్చిన నాటి నుంచి కలలు కంటూ వుంటారు. అయితే కొందరి జీవితంలో మాత్రం ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా, రహస్యంగా జరుగుతూ వుంటుంది. ఇది విధి రాత అనుకోవాలో, పరిస్దితులు అనుకోవాలో కానీ ఆ పరిస్ధితిని ఎదుర్కోక తప్పదు. దీనికి సామాన్యులే కాదు .. ప్రముఖులు సైతం అతీతులు కాదు. మరి ఇలా రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్లు ఎవరో ఒకసారి చూస్తే:

1) సావిత్రి:

తిరుగులేని నటిగా , మహానటిగా దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన సావిత్రి .. కెరీర్ పీక్స్‌లో వుండగానే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలున్న జెమిని గణేశన్‌ను రహస్యంగా పెళ్లాడి అభిమానులకు, చిత్ర పరిశ్రమకు షాకిచ్చారు. ‘‘LUX’’ సబ్బు ప్రమోషన్ సందర్భంగా జెమిని గణేషన్ అని సంతకం చేయడంతో జెమిని పెళ్లాడిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.

2) జయప్రద :

తెలుగింటి ఆడపడచుగా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్‌ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్లయి, పిల్లలు వుండటంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద

3) శ్రీదేవి:

అందాల తార శ్రీదేవి రెండు సార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్‌ని ప్రేమించిన శ్రీదేవి అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

4) దేవయాని:

సుస్వాగతంలో పవన్ కల్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత దక్షిణాదిలో గుర్తుండిపోయే పాత్రలు చేసిన దేవయాని.. రాజకుమార్ అనే దర్శకుడితో ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ.. ఆమె ప్రయత్నం ఫలించలేదు. దీంతో కోరుకున్న వ్యక్తి కోసం కుటుంబ సభ్యుల మాటను కాదని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు దేవయాని.

5) అనన్య :

సినిమాల్లో జరిగినట్లు లేచిపోయి పెళ్లి చేసుకున్న మరోనటి అనన్య. ఈ మలయాళ కుట్టీ.. ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించి పారిపోయి వివాహం చేసుకున్నారు.

6) సీత :

ముద్దుల మావయ్యలో బాలకృష్ణగా చెల్లెలిగా నటించి తెలుగు ప్రజల అభిమానం పొందిన సీత.. తర్వాత హీరోయిన్‌గా కోలీవుడ్‌లో సత్తా చాటారు. ఈ క్రమంలో తమిళ నటుడు పార్ధీబన్‌ని ప్రేమించారు. కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. తర్వాత సీరియల్ నటుడు సతీష్‌ని 2010లో ఎవరికీ చెప్పకుండా రెండో వివాహం చేసుకున్నారు.

7) సాత్నా టైటస్:

బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీతో సమానంగా నటించి సెంటిమెంట్ పండించిన మలయాళ నటి సాత్నా టైటస్ కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బిచ్చగాడు సినిమాకు బయ్యర్‌గా వున్న కార్తికీని ప్రేమించి అతని కోసం ఇంతటి సాహసం చేశారు.

8) శ్రీయా శరణ్:

ప్రేమ, పెళ్లి, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచి మొత్తం పరిశ్రమకే షాకిచ్చారు శ్రీయా శరణ్. రష్యాకి చెందిన ఆండ్రీ కోషీవ్‌ని ప్రేమించిన విషయం గానీ పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.

9) రమ్యకృష్ణ:

నవరసాలను అద్భుతంగా పలకించే నేటి తరం నటీమణుల్ని వ్రేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో వున్న పరిచయం , ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.

10) రాణీ ముఖర్జీ:

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రాణీ ముఖర్జీ .. హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన చోప్రా ఫ్యామిలీ వారసుడు ఆదిత్య చోప్రాని ప్రేమించారు. వీరి ప్రేమాయణం చాలా గుట్టుగా సాగింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని మ్యాగజైన్లు, వారపత్రికల్లో ఫోటోలు, కథనాలు వచ్చేవి. కానీ రాణీ వీటిని ఎప్పటికప్పుడు ఖండించేవారు. చివరికి హిందీ మీడియా ఊహించిందే జరిగింది. ఎవరికీ కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా 2014, ఏప్రిల్ 21న ఆదిత్య చోప్రాని ఇటలీలో రహస్యంగా పెళ్లాడారు రాణీ ముఖర్జీ. ఈ దంపతులకీ అధిర అనే కుమార్తె జన్మించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus