‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

ఓ సినిమా రిలీజ్ కు ముందు చేసే బిజినెస్.. రిలీజ్ తర్వాత రాబట్టిన కలెక్షన్స్ ను బట్టి ఆ మూవీ హిట్టా.. ప్లాపా అనేది డిసైడ్ చేస్తుంటాయి ట్రేడ్ వర్గాలు. సినిమాకి పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టు నిర్మాత నాన్ థియేట్రికల్ మరియు థియేట్రికల్ బిజినెస్ హక్కులను అమ్ముకుంటాడు. అయితే సినిమా థియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ మార్క్ ను పరిగణలోకి తీసుకునే.. అది హిట్టా ప్లాపా అనేది ఫైనల్ అవుతుంది. థియేట్రికల్ బిజినెస్ ను సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ మ్యాచ్ చేయలేకపోతే అది హిట్ అని చెప్పలేం. చాలా వరకు సినిమాలు పెట్టిన పెట్టుబడిని మాత్రమే వెనక్కి రాబడతాయి. కొన్ని సినిమాలు అసలు బిజినెస్ ను మ్యాచ్ చేయవు. వాటిని ప్లాపులు డిజాస్టర్లు అంటాము. అయితే కొన్ని సినిమాలు మాత్రం బయ్యర్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టినవి ఉన్నాయి. టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ లాభాలను రాబట్టిన సినిమాలు.. టాప్ 10 లో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) బాహుబలి2 :

రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి రూ.350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.814 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే మొత్తంగా రూ.464 కోట్ల లాభాలను రాబట్టి చరిత్ర సృష్టించింది ఈ మూవీ.

2) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి రూ.116 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.311.02 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే మొత్తంగా రూ.195 కోట్ల లాభాలను రాబట్టింది ఈ మూవీ.

3) అల వైకుంఠపురములో :

త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సో ఈ చిత్రం ఓవరాల్ గా రూ. 75.88 కోట్ల లాభాలను అందించింది.

4) ఆర్.ఆర్.ఆర్ :

రాజమౌళి- ఎన్టీఆర్- చరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి రూ.500 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.566.14 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.66.14 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.

5) గీత గోవిందం :

విజయ్ దేవరకొండ- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్(బుజ్జి) దర్శకుడు. ఈ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 70.60 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అంటే మొత్తంగా 55 కోట్ల లాభాల్ని అందించింది.

6) ఎఫ్2 :

వెంకటేష్- వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి రూపొందిన ఈ ఫన్ ఫిల్డ్ మల్టీస్టారర్ చిత్రానికి రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా.. ఫుల్ రన్లో రూ.81.05 షేర్ నమోదైంది. సో ఈ మూవీ రూ.49.05 కోట్ల లాభాలను అందించింది.

7) రంగస్థలం :

రాంచరణ్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి రూ.80.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.119.45 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.39.09 కోట్ల భారీ లాభాలు దక్కినట్టు తెలుస్తుంది.

8) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.138.78 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.37.78 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.

9) మగధీర :

రాంచరణ్- రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి రూ.40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.77.96 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.37.54 కోట్ల లాభాలను అందించింది.

10) సోగ్గాడే చిన్ని నాయన :

అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ఈ మూవీకి రూ.18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.47.47 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవరాల్ గా రూ.28.97 కోట్ల లాభాలను అందించింది..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus