Akshay Kumar: 3 నిమిషాలలో 184 సెల్ఫీలు.. రికార్డ్ సృష్టించిన నటుడు అక్షయ్ కుమార్!

  • February 24, 2023 / 07:03 PM IST

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈయన మూడు నిమిషాల సమయంలో ఏకంగా 184 మంది అభిమానులతో సెల్ఫీలు దిగి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ విధంగా ఈయన మూడు నిమిషాలలోనే 184 సెల్ఫీలు దిగి హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్ రికార్డును బ్రేక్ చేశారు. ఇటీవల ముంబైలోని మహబూబ్ స్టూడియోలో గిన్నిస్ బుక్ అధికారుల ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్ తో సెల్ఫీ పోటీలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఈయనతో సెల్ఫీలు దిగడానికి దాదాపు 240 మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ పోటీలలో భాగంగా మూడు నిమిషాలలో నటుడు అక్షయ్ కుమార్ 209 సెల్ఫీలు దిగారు. అయితే ఇందులో సరిగా రాని సెల్ఫీలను డిస్క్ క్వాలిఫై చేశారు. సెల్ఫీలు బ్లర్ గా వచ్చి ఉన్నటువంటి వాటిని డిస్క్ క్వాలిఫై చేస్తూ చివరికి 184 సెల్ఫీలతో ఆయన రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ అధికారులు ఈయన రికార్డుకు సంబంధించిన పత్రాన్ని అందించారు.

అయితే ఈ విషయంపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ తన ఈ విజయాన్ని అభిమానులకు అంకితం చేశారు. నటుడిగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టినది తన అభిమానులేనని ఈయన తెలియజేశారు.ఇలా నన్ను ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నానని తెలిపారు. అయితే ఇప్పటివరకు 168 సెల్ఫీలతో ఈ రికార్డు హాలీవుడ్ నటుడు జేమ్స్ స్మిత్ పేరు మీద ఉండగా ఇప్పుడు అక్షయ్ కుమార్ ఆ రికార్డును చెరిపేసి 184 ఫోటోలతో సరికొత్త రికార్డు సృష్టించారు.ఇలా హాలీవుడ్ నటుడు రికార్డును అక్షయ్ బ్రేక్ చేయడంతో అక్షయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus