కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

1989 లో వచ్చిన ‘బాల గోపాలుడు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే అతను హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం 2003 లో వచ్చిన ‘తొలిచూపులోనే’ చిత్రంతో..! హీరోగా అతను 19 సినిమాల్లో నటించాడు. ఇందులో ‘అతనొక్కడే’, ‘పటాస్’, ‘118’, ‘బింబిసార’ వంటి చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ‘అసాధ్యుడు’, ‘హరేరామ్’, ‘ఎం.ఎల్. ఎ’ వంటి చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. తాజాగా ‘అమిగోస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకి మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ నమోదైంది. బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. శని, ఆదివారాలు పికప్ అయితే బాక్సాఫీస్ వద్ద కోలుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కళ్యాణ్ రామ్ కత్తి :

కళ్యాణ్ రామ్ హీరోగా ఎ.మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.10 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.7.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ గా నిలిచింది.

2) ఓం 3D :

కళ్యాణ్ రామ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.6.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాత కావడం గమనార్హం.

3) పటాస్ : 

కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.16 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4)షేర్ :

కళ్యాణ్ రామ్ హీరోగా ఎ.మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.3.8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

5) ఇజం :

కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.11.25 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

6) ఎం.ఎల్.ఎ :

కళ్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.9.32 కోట్ల షేర్ ను రాబట్టి.. యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

7) నా నువ్వే :

కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.6.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ.1.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

8) 118 :

కళ్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.11 కోట్ల వరకు షేర్ ను రాబట్టి.. కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

9) ఎంత మంచివాడవురా :

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.10 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి రూ.6.94 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

10) బింబిసార :

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.37.92 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ చిత్రం మొదటి రోజు రూ.2.5 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.12.97 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అంత రాబడుతుందో లేదో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus