మోహన్ లాల్ నుండి మహేష్ బాబు వరకు ‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే..

‘గజిని’ మూవీతో ఎ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాతో స్టార్ డైరెక్ట‌ర్‌గా సెటిల్ అయిపోయాడు.. వెర్సటైల్ యాక్టర్ సూర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించిన సినిమా.. తమిళ నాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు. ఆసిన్ కథానాయి కాగా.. హారిస్ జైరాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. తర్వాత హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే..

లవ్, కామెడీ, రివేంజ్, ఎమోషన్స్, థ్రిల్ కలిగించే అన్ని అంశాలతో తెరకెక్కిన ‘గజిని’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు.. సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక కథ అనుకుని, నిర్మాతను పట్టుకుని.. ఓ హీరోని అనుకుని అతనికి కథ చెప్పడం.. వర్కౌట్ కాకపోతే మరో హీరో దగ్గరకెళ్లడం.. నిర్మాతలు, హీరోలు, కథలు, దర్శకులు మారడం అనేది కొన్ని కొన్ని సార్లు జరుగుతుంటుంది. స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో సూపర్ హిట్స్ కొట్టారు చాలా మంది డైరెక్టర్లు..

అలాగే ‘గజిని’ కథ విన్న తర్వాత తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం స్టార్స్ కొందరు ‘నో’ చెప్పేశారు. అలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది.. అయితే కొంతమంది డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నటించకపోవచ్చు.. ఇంకొంతమంది ‘అసలు ఇదేం కథ రా నాయనా’ అనుండొచ్చు కానీ.. చివరికి 13వ హీరో సూర్య సెట్ అయ్యాడు.. అలా ‘ది కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ‘గజిని’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) అజిత్

2) ఆర్. మాధవన్

3) మహేష్ బాబు

4) సల్మాన్ ఖాన్

5) విజయ్

6) విక్రమ్

7) రజినీ కాంత్

8) వెంకటేష్

9) శింబు

10) అజయ్ దేవ్‌గన్

11) సైఫ్ అలీ ఖాన్

12) మోహన్ లాల్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus