Brahmaji: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రహ్మాజీ రిప్లై.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లలో, ప్రముఖ హోటళ్లలో ఫుడ్ తినేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేసుకుని మరీ చాలామంది ఫుడ్ తింటున్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు చేయగా ఆ తనిఖీలలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రముఖ రెస్టారెంట్లు నాణ్యత లేని, ఎక్స్ పైరీ డేట్ ముగిసిన పదార్థాలను వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు.

వైరల్ అవుతున్న వార్తలు చూసి రెగ్యులర్ గా హోటల్స్ లో ఫుడ్ తినేవాళ్లు షాకవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులను ఉద్దేశించి బహ్మాజీ (Brahmaji) “మరి ఎక్కడ తినమంటారు సార్.. ఇంట్లోనా” అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కు 2400కు పైగా లైక్స్ వచ్చాయి. హోటల్ ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ సేఫ్ అని అధికారుల తనిఖీలతో వెల్లడైంది.

హైదరాబాద్ వాసులకు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఒకింత భయాందోళనకు గురి చేశాయి. కొన్ని రెస్టారెంట్ల కిచెన్ లలో బొద్దింకలు ఉండటంతో భోజన ప్రియులలో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. నాణ్యతను గాలికి వదిలేసి ప్రముఖ రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటూ వేర్వేరు విషయాల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

వయస్సు పెరుగుతున్నా బ్రహ్మాజీకి ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరో పదేళ్ల పాటు బ్రహ్మాజీ కెరీర్ కు ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మాజీ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. బ్రహ్మాజీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus