సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ ని నాల్గో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. అతడి పెళ్లి న్యూస్ రాగానే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. నరేష్, పవిత్రా లోకేష్ హోటల్ లో ఉంటే అక్కడికి సైతం రమ్య రఘుపతి వెళ్లారు. అక్కడ ఆమె గొడవ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నరేష్, పవిత్రా లోకేష్ లను అక్కడ నుంచి పంపించేశారు. అయితే ఈ సందర్భంగా రమ్య రఘుపతి..
పవిత్రా లోకేష్ ను చెప్పుతో కొట్టడానికి రెడీ అయ్యారు. పోలీసులు ఆమెని అడ్డుకొని పరిస్థితిను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే రమ్య వెంట వచ్చిన వారు.. నరేష్ డౌన్ డౌన్, పవిత్రా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారంతా అరుస్తూ ఉంటే నరేష్ మాత్రం విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో రమ్య రఘుపతిని ఉద్దేశిస్తూ ‘చీటర్ చీటర్’ అంటూ అరిచారు నరేష్. అలానే ఆమెపై మరో ఆరోపణ చేశారు.
ఇప్పటికే తన భార్యకు, ముస్లిం డ్రైవర్ తో ఎఫైర్ ఉందని చెప్పిన నరేష్.. ఇప్పుడు ఆమెకి మరో రిలేషన్ ఉందని అన్నారు. రమేష్ శెట్టి అనే వ్యక్తితో రమ్యకి సంబంధం ఉందని.. వీరిద్దరూ లవర్స్ అని, ఇద్దరూ కలిసి తనను మోసం చేయాలనీ, బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించినట్లు నరేష్ చెప్పుకొచ్చారు.
అయితే ఓ వ్యక్తి మాత్రం వారిద్దరూ అన్నాచెల్లెళ్లు అని చెబుతున్నారంటూ తెలిపారు. మొత్తానికి నరేష్, పవిత్రా లోకేష్, రమ్య రఘుపతి పేర్లు కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు మాత్రం ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా..? అంటూ నరేష్, పవిత్రాలను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకెక్కడ వరకు వెళ్తుందో చూడాలి!