Naresh: మరోసారి హాట్ టాపిక్ అయిన సీనియర్ నరేష్ కామెంట్స్..!

సీనియర్ హీరో నరేష్ (Naresh) .. గొప్ప నటుడు. ఎలాంటి పాత్ర ఇచ్చినా.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి.. తన బెస్ట్ ఇస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ రియల్ లైఫ్ లో నరేష్.. బిహేవియర్ రకరకాలుగా ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ నుండి.. మాట్లాడే మాటలు అన్నీ చాలా వింతగా ఉంటాయి. సినిమా వేడుకల్లో నరేష్ హైలెట్ అవ్వడం కోసం ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న ఒక సినిమా ఈవెంట్లో..

Naresh

ఆ సినిమా టీజర్ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంది అంటూ చెప్పాడు. కానీ అతను చెప్పినట్టు జరగలేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే.. అంటే ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ టైంలో మహేష్ బాబుకి నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కామెంట్లు చేశాడు. తర్వాత ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి విడ్డూరపు కామెంట్లు చేసి వార్తల్లో నిలిచాడు నరేష్. విషయం ఏంటంటే.. నిన్న ‘విశ్వం’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

దసరాకి రిలీజ్ అయిన ఈ సినిమా ‘పర్వాలేదులే’ అనే రేంజ్లో టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నెగ్గుకురాలేకపోతుంది. అయితే రెండో వారం పెద్ద సినిమాలు లేవు కాబట్టి..’కలిసొస్తుందేమో’ అని భావించి ఈవెంట్ పెట్టుకుని పుష్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో కూడా తప్పులేదు. అందరూ బాగా స్పీచ్..లు ఇచ్చారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో నరేష్ మైక్ అందుకున్నాడు. ‘2024 లో వచ్చిన సినిమాల్లో ‘విశ్వం’ (Viswam)  బిగ్గెస్ట్ హిట్’ అంటూ ఓ బాంబు పేల్చాడు.

దీనికి డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla), గోపీచంద్(Gopichand) ..లు కూడా షాక్ అయినట్టు ఉన్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టలేకపోయారు. ఇక నరేష్ కామెంట్స్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘నరేష్ సినిమాలు చూడటం మానేశాడా? లేక సినిమాల గురించి తెలుసుకోవడం మానేశాడా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. అసలే బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతున్న సినిమా ‘ఇయర్లో బిగ్గెస్ట్ హిట్’ అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి.

నాని – శ్రీకాంత్ ఓదెల.. టైటిల్ ఫిక్స్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus