Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ (Balakrishna)   తనయుడు మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagnya) త్వరలోనే వెండితెరకు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయంపై గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mokshagnya

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ (Mokshagnya) నటించబోయే ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నందమూరి తేజస్విని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల వచ్చిన ఒక లీక్ ప్రకారం, ఈ సినిమాలో మోక్షజ్ఞ తల్లిగా సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) నటించనున్నట్లు సమాచారం.

శోభన గతంలో రజినీకాంత్ మరియు బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పనిచేసి మంచి గుర్తింపు పొందింది. గతంలో బాలకృష్ణతో ‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వగోపాలుడు’ వంటి హిట్ చిత్రాల్లో శోభన తన అద్భుత నటనతో మెప్పించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు నందమూరి అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరుగుతోంది. మరి మోక్షజ్ఞ తన డెబ్యూ చిత్రంతో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాను 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

అప్పుడే కొట్టేసి వెళ్లిపోయిన రెహమాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus