Kichcha Sudeep: ఇద్దరు స్టార్‌ హీరోలు బిగ్‌బాస్‌ను వదిలేశారు.. నెక్స్ట్‌ ఎవరు?

బిగ్‌బాస్‌ అంటే ఎంటర్‌టైన్మెంట్‌ ఎంతో.. స్టార్‌ కలరింగ్‌ అంతే. అంటే ఆ షోను స్టార్‌ హీరోలు హోస్ట్‌ చేస్తేనే ఓ అందం, హైప్‌ ఉంటుంది. తెలుగులో గతంలో ఆ పరిస్థితి చూశాం కూడా. అయితే ఇప్పుడు ఈ షో నుండి స్టార్‌ హీరోలు వరుస పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. కారణాలు ఏం చెబుతున్నా.. షో హోస్టింగ్‌ నుండి బయటకు వచ్చేయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారగా.. ఇప్పుడు కన్నడ హోస్ట్‌ కూడా మారుతున్నారు. దీంతో నెక్స్ట్‌ ఎవరు? అనే చర్చ మొదలైంది.

Kichcha Sudeep

ఇక కన్నడ బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనని ప్రముఖ కథానాయకుడు సుదీప్ (Kichcha Sudeep) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీప్ ప్రకటన అభిమానులను, బిగ్ బాస్ వీక్షకులను, షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కొందరు అసందర్భ ఆరోపణలు కూడా చేశారు. విషయం దూరం వెళ్తోందని గ్రహించిన సుదీప్‌ తాజాగా ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కన్నడ బిగ్ బాస్ ప్రారంభమై 11 ఏళ్లు అవుతున్నాయి.

తొలి సీజన్‌ నుండి సుదీపే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే సీజన్ నుండి హోస్టింగ్‌ చేయనని సుదీప్ ప్రకటించాడు. ఈ ప్రకటనకు సొంత కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. కలర్స్ ఛానెల్, బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనను అవమానించారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. బిగ్‌ బాస్‌ విషయంలో నాకు, కలర్స్ ఛానల్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, ఆ ఛానెల్ నన్ను అగౌరవపరిచిందంటూ ప్రచారం చేసే వ్యక్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.

కలర్స్ ఛానల్‌తో నాది సుదీర్ఘ ప్రయాణం. బిగ్ బాస్ నుండి ఎందుకు తప్పుకుంటున్నాననే విషయాన్ని నా గత ట్వీట్ లో స్పష్టంగా, సూటిగా చెప్పాను. కలర్స్ ఛానల్‌తో నా సంబంధం ఎప్పటిలానే బాగుంది. వారు ఎల్లప్పుడూ నన్ను గౌరవంగా చూస్తారు అని సుదీప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. మా మధ్య విభేదాలున్నాయన్నది అపోహ మాత్రమే.

నేను పనిచేస్తున్న టీమ్‌పై లేనిపోని ఆరోపణలు ఎదురవుతున్నప్పుడు చూస్తూ ఊరుకుని ఆనందించే వ్యక్తిని నేనను కాదు అని అన్నాడు. అలాగే తన మీద ప్రేమ చూపిస్తున్నవారికి, మద్దతు తెలియజేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పాడు. ఈ ప్రేమను, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని రాసుకొచ్చాడు. మరోవైపు ఇలా వెళ్లిపోయే నెక్స్ట్‌ హీరో ఎవరు అనే చర్చ బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌లో మొదలైంది.

నాని కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరు? ప్రచారంలోకి మరో కపూర్‌ భామ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus