Nani ,Srikanth Odela: నాని – శ్రీకాంత్ ఓదెల.. టైటిల్ ఫిక్స్?

నేచురల్ స్టార్ నాని (Nani) , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)   కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుంది. ‘దసరా’ (Dasara)  సినిమాతో ఈ ఇద్దరూ టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నానికి అది ఒక భారీ హిట్‌గా నిలబడగా, శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రంతోనే దర్శకుడిగా బలమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈసారి కూడా మాస్ యాక్షన్ నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందనుందని సమాచారం.

Nani , Srikanth Odela

శ్రీకాంత్ ఓదెల ఈ ప్రాజెక్ట్‌ కోసం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు చాలా కాలం కష్టపడినట్లు తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవగా ఇటీవల అధికారికంగా మేకర్స్ సినిమాను లాంచ్ చేశారు. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే, ‘నాయుడిగారి తాలూకా’ అనే పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని, సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాతే టైటిల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ టైటిల్ ప్రస్తావనతోనే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు కూడా ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించారు. దసరా విజయాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత గ్రాండ్ గా సినిమా రూపొందించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సుమారు 100 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించారట.

ఇప్పటికే అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పని చేయనున్నారట. నాని ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం, ఇది మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఆ చిన్నారికి ప్రాణం పోసి.. చెర్రీ గ్రేట్‌ అంటూ.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus