Vishwambhara: ఏకంగా అన్ని నెలలు వాయిదా వేస్తున్నారా.. కారణం?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) పై మంచి హైప్ ఉంది.మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల బయటకొచ్చింది. చిరు లుక్స్ బాగున్నాయని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. అసలుకైతే 2025 జనవరి 10 న అంటే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ ని విడుదల చేయాలనుకున్నారు. చిరు కూడా పట్టుబట్టి అదే డేట్ కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా టీంతో పని చేయించారు. కానీ ‘ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కొన్ని కారణాల వల్ల క్రిస్మస్ బరి నుండి తప్పుకోవడంతో…

Vishwambhara

సంక్రాంతికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడుకు సినిమా కాబట్టి.. చిరు కూడా తగ్గి ‘విశ్వంభర’ ని వాయిదా పడేలా చేశారు’ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇన్సైడ్ టాక్ వేరే ఉంది. ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో టీం సంతృప్తి చెందలేదట. ఆడియన్స్ రియాక్షన్ ని చెక్ చేయడం కోసమే టీజర్ ని వదిలారట. అనుకున్నట్టే సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో.. కొంచెం టైం తీసుకుని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిరు అండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అనుకుంటున్న డేట్ అయితే మే 9 అని తెలుస్తుంది. అదే డేట్ కి గతంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. చిరుకి మే నెలలో ‘గ్యాంగ్ లీడర్’ వంటి ఆల్ టైం హిట్లు పడ్డాయి.పైగా సమ్మర్ హాలిడేస్ సీజన్, చిన్న పిల్లలు చూసే సినిమా కూడా కాబట్టి.. ఆ డేట్ కే ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తుంది.

‘వేట్టయన్’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus