నరేష్ పవిత్ర పెళ్లి వీడియో పై క్లారిటీ… మళ్లీ పెళ్ళంటూ కామెంట్స్ చేసిన నరేష్!

  • March 24, 2023 / 06:29 PM IST

సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇదివరకే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటూ తిరిగి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు.ఇలా పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈయన తనని పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ వ్యవహరించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే నరేష్ డిసెంబర్ 31వ తేదీ పవిత్ర లోకేష్ కు లిప్ లాక్ చేసినటువంటి వీడియోని షేర్ చేస్తూ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని ఈ వీడియోని షేర్ చేయగా ఇది క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఇదంతా నిజమేనని అందరూ షాక్ అయ్యారు.ఇక ఈ షాక్ లో నుంచి బయటకు రాకముందే నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అందరూ ఇది నిజమేనా ఆశ్చర్యపోగా మరికొందరు ఏదైనా సినిమా ప్రమోషన్లలో భాగమై ఉంటుందని సందేహాలను వ్యక్తం చేశారు.

ఇక ఈ పెళ్లి గురించి పలుమార్లు నరేష్ ను ప్రశ్నించగా ఆయన సరైన సమయం చూసి ఈ విషయం గురించి మాట్లాడతానని తెలిపారు. అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ తో పెళ్లి విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోలేదని కేవలం సినిమాలో భాగంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. నరేష్ పవిత్ర జంటగా మళ్లీ పెళ్లి అని సినిమాలో నటించబోతున్నారు.

ఈ సినిమాలో భాగంగా వీరిద్దరికీ పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నరేష్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.అయితే తాజాగా నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతుందని ఈయన అసలు విషయం తెలియజేశారు.పెళ్లి గురించి ఈ విధంగా నరేష్ క్లారిటీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus