సీనియర్ నటుడు వీకే నరేష్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన పవిత్రా లోకేశ్ తో గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. అంతే కాకుండా గతేడాది వారి ప్రేమ వ్యవహారాన్ని స్వయంగా బట్టబయలు చేశారు. అప్పటి నుండి వీరి వ్యవహారం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ జంట మరొకసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
గతంలో న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే అదంతా కేవలం సినిమా కోసం మాత్రమేనని తర్వాత వెల్లడించారు. వీరిద్దరూ కీలకపాత్రలలో మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులలో నరేష్, పవిత్ర లోకేష్ బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తూ ఈ జంట రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకుంటూ రెచ్చిపోతున్నారు. దీంతో వీరిద్దరూ మళ్లీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా మళ్లీ పెళ్లి సినిమా నుండి ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ చూస్తే… నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. కానీ నరేష్ మాత్రం ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా గురించి హైప్ క్రియేట్ చేయడానికి (Naresh) నరేష్ పవిత్రలోకి బాగా కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న నరేష్ పవిత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో నరేష్ మాట్లాడుతూ… ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల కలిసి జీవిస్తున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా భూమి బద్దలైన ఆకాశం విరిగిపడినా కూడా ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!