ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కీలక రోల్ చేస్తున్న యంగ్ హీరో

  • April 18, 2018 / 08:33 AM IST

జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈనెల 25 వరకు సాగే ఈ షెడ్యూల్ ల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేయనున్నారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరించనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా కోసం రామోజీ పిలింసిటీలో భారీ సెట్ వేస్తున్నారు. రాయ‌ల‌సీమకు చెందిన ఓ గ్రామం సెట్‌ ని దాదాపు రెండెక‌రాల్లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ పనులు పూర్తికావచ్చాయి. కేవలం ఈ సెట్ కోసం 4 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. వచ్చే నెలలో ఈ భారీ షెడ్యూల్ మొదలుకానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో ఒక కీలక పాత్ర లో యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపించనున్నారని తెలిసింది.

మొదటి షెడ్యూల్లోనే నవీన్ చంద్ర పాల్గొన్నట్టు సమాచారం. ‘అందాల రాక్షసి’ చిత్రంతో పరిచయమైన నవీన్ చంద్ర హీరోగా అనేక సినిమాలు చేశారు. క్లిక్ కాకపోవడంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉన్న రోల్స్ చేస్తున్నారు. నాని ‘నేను లోకల్’ చిత్రంలో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో నటన చూసే త్రివిక్రమ్ ఈ హీరోకి అవకాశమిచినట్లు టాక్. అయితే అది నెగటివ్ రోలా? పాజిటివ్ రోలా? అనేది మాత్రం సస్పెన్స్. ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus