Prabhu: కిడ్నీ సమస్యతో హాస్పిటల్ పాలైన నటుడు ప్రభు!

  • February 22, 2023 / 10:23 AM IST

ఒకప్పటి హీరో.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో సహయనటుడి పాత్రలు పోషిస్తున్న ప్రభు అనారోగ్యం పాలయ్యారు .దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించడం జరిగింది.కొన్నాళ్లుగా ప్రభు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు లేజర్ సర్జరీ చేసి కిడ్నీలో ఉన్న రాళ్ళను తొలగించినట్టు వైద్యులు తెలిపారు. ఇక ఎటువంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా వైద్యులు తెలిపినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం.

మరో రెండు రోజుల పాటు ఆయన్ని అబ్జర్వేషన్ లో ఉంచి.. తర్వాత డిశ్చార్జ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభు పూర్తిగా కోలుకోవాలని ఆయన్ని అభిమానించేవారు పూజలు వంటివి చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రభు బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విజయ్ వారసుడు చిత్రంలో ప్రభు నటించారు. తెలుగులో ఆయన డార్లింగ్, ఆరెంజ్, దేనికైనా రెడీ, ఒంగోలు గిత్త , రంగ రంగ వైభవంగా వంటి సినిమాల్లో నటించారు.ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్ గారి అబ్బాయిగా ప్రభు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభు అటు తర్వాత హీరోగా కూడా మారి పలు హిట్ సినిమాల్లో నటించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus