Rakshit Atluri: టికెట్ రేటు మాత్రమే కాదు పాప్ కార్న్ రేటు కూడా తిరిగిచ్చేస్తాడట

  • October 26, 2023 / 12:10 AM IST

ఇటీవల మ్యాడ్ అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లో నిర్మాత నాగ వంశీ..’ మ్యాడ్ సినిమా చూశాక… జాతి రత్నాలు సినిమాకంటే తక్కువ నవ్వాము అని చెబితే మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను ‘ అంటూ చెప్పాడు. మొదట నాగ వంశీ ‘అతి ‘కి పోతున్నాడు అని కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మ్యాడ్ సినిమా రిలీజ్ అయ్యాక నాగ వంశీ కాన్ఫిడెన్స్ అందరికీ తెలిసి వచ్చింది.

ఇప్పుడు నాగ వంశీలాగే మరో యంగ్ హీరో కూడా తన సినిమా నచ్చలేదు అని చెబితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అని చెబుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పలాస వంటి రా అండ్ రష్టిక్ మూవీలో హీరోగా నటించిన రక్షిత్ అట్లూరీ అందరికీ గుర్తుండే ఉంటాడు. దానికి ముందు లండన్ బాబులు అనే సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమాకి కూడా మంచి స్పందన లభించింది. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ నరకాసుర.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. ఇక ట్రైలర్ లాంచ్ వేడుకలో రక్షిత్ మాట్లాడుతూ.. ‘ మా సినిమా కనుక మీకు నచ్చలేదు అని చెబితే.. మేము టికెట్ డబ్బులు మాత్రమే కాదు, మీ పాప్ కార్న్ డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాము. అందులో ఎలాంటి డౌట్ లేదు ‘ అంటూ ధీమాగా చెప్పుకొచ్చాడు. మరి అంత విషయం సినిమాలో ఉందా? లేదా? అనేది చూడాలి

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus