తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటుడు శ్రీహరి కూడా ఒకరు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో స్టార్ హీరోల సినిమాలలో వారికి బాబాయ్ అన్నయ్య పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమాలలో కొనసాగుతూనే ఈయన కాస్త అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇలా అనారోగ్యానికి గురైనటువంటి శ్రీహరి ముంబైలోని ఒక సినిమా షూటింగ్లో పాల్గొనగా ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు.
ఈయనని వెంటనే ముంబై ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇలా శ్రీహరి మరణం ఇండస్ట్రీకి ఇప్పటికీ తీరని లోటు అని చెప్పాలి. ఇక శ్రీహరి నటి డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు త్వరలోనే వీరు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంట కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా శ్రీహరికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనే విషయం మనకు తెలుసు కానీ ఈయనకు ఒక కుమార్తె కూడా జన్మించారట అయితే ఆ చిన్నారి నాలుగు నెలల వయసులోనే మరణించారని తెలుస్తుంది.
ఇలా శ్రీహరికి కుమార్తె జన్మించడంతో ఆ చిన్నారికి అక్షర అనే పేరు కూడా పెట్టారని అయితే ఆమె నాలుగు నెలల వయసులోనే చనిపోవడంతో తన కుమార్తెకు గుర్తుగా శ్రీహరి అక్షర ఫౌండేషన్ స్థాపించారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ విధంగా శ్రీహరి తన కుమార్తె అక్షర పేరు మీదట ఫౌండేషన్ స్థాపించి కొన్ని గ్రామాలలో అధికంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతూ ఉండగా వారికి ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారట.
ఈ విధంగా శ్రీహరి (Srihari) కుమార్తె పేరు మీదగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు అయితే ఈయన మరణించిన తర్వాత తన కుటుంబ పరిస్థితి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము అంటూ డిస్కో శాంతి పలు సందర్భాలలో తెలియజేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా శ్రీహరి గారికి ఒక కూతురు కూడా జన్మించారు అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!