సీనియర్ హీరో సురేష్ అందరికీ సుపరిచితమే. తెలుగువాడే అయినప్పటికీ తమిళ సినిమాలతో కెరీర్ ని స్టార్ట్ చేశాడు సురేష్. ‘పన్నీర్ పుష్పాంగళ్’ ఇతని మొదటి సినిమా. తర్వాత తెలుగులో కూడా సినిమాలు చేసి సక్సెస్..లు అందుకున్నాడు సురేష్. తర్వాత సహజంగానే ఇతనికి అవకాశాలు తగ్గాయి. హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారక తప్పలేదు. అప్పుడప్పుడు విలన్ గా కూడా చేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. సురేష్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు.
గతంలో ఇతను అనిత అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. 1990 లో వీరి పెళ్లి జరగ్గా.. 1995 లో అంటే.. పెళ్ళైన 5 ఏళ్లకే ఆయన విడాకులు తీసుకోవడం జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు సురేష్. అతను మాట్లాడుతూ.. “నా మొదటి భార్యతో విడిపోవడానికి బలమైన కారణాలు అంటూ పెద్దగా ఏమీ లేవు. ఎక్కువగా గొడవలు అయ్యింది కూడా ఏమీ లేదు. నేను 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, ఆమెకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. మా పెద్దలు మాకు పెళ్లి చేశారు.
అనితకు చదువుకుని అమెరికాలో సెటిల్ కావాలనే కోరిక ఉంది. నటుడిగా నేను అక్కడికి వెళ్లడం కుదరదు. మొదట్లో ఆమె పరిశ్రమలోనే ఉండేవారు. చదువుకోవాలనే కోరికతో నటనకి దూరమైంది. అందుకే పరస్పర అంగీకారంతో విడిపోయాం. అమెరికాలో చదువుకుని అక్కడే ఓ వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది అనిత. నేను కూడా రెండో వివాహం చేసుకున్నాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. నేను అమెరికా వెళితే వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తూ ఉంటాను.
వాళ్ళు ఇక్కడికి వస్తే మా ఇంటికి వస్తారు. అనిత భర్త కూడా చాలా మంచి వ్యక్తి. నా కొడుకుని కూడా అతను చాలా బాగా చూసుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక ఆమె అనిత సురేష్ అని పేరు మార్చుకుంది. ఇప్పటికీ కూడా అదే పేరు కంటిన్యూ చేస్తుంది. ‘నేను సంపాదించానో నువ్వు సంపాదించిందో’ అనేది అనవసరం… ఉన్న ఆస్థిని చెరో సగం తీసుకుందాం అనుకున్నాము. అదే చేశాం” అంటూ సురేష్ (Suresh) చెప్పుకొచ్చారు.