Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Lal Salaam Review in Telugu: లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lal Salaam Review in Telugu: లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 9, 2024 / 06:42 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Lal Salaam Review in Telugu: లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రజనీకాంత్ , విష్ణు విశాల్ (Hero)
  • NA (Heroine)
  • విక్రాంత్ , విఘ్నేష్ , సెంథిల్ , జీవిత, తంబి రామయ్య , ధన్య బాలకృష్ణ , కపిల్ దేవ్ (Cast)
  • ఐశ్వర్య రజనీకాంత్ (Director)
  • విష్ణు రంగసామి, ఐశ్వర్య రజనీకాంత్ (Producer)
  • AR రెహమాన్ (Music)
  • విష్ణు రంగసామి (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 09, 2024
  • లైకా ప్రొడక్షన్స్ (Banner)

“జైలర్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రజనీకాంత్ ఓ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం “లాల్ సలామ్”. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ కథానాయకుడు. క్రికెట్ మరియు మత ఘర్షణల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 9) విడుదలవుతున్న విషయంలో రజనీకాంత్ డైహార్డ్ ఫ్యాన్స్ కు కూడా తెలియదు అంటే ఏస్థాయిలో ప్రమోట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. మరి అంత తక్కువ పబ్లిసిటీతో విడుదలవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: గురు (విష్ణు విశాల్) & శంశుద్ధీన్ (విక్రాంత్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒక క్రికెట్ మ్యాచ్ కారణంగా రేగిన అల్లర్ల వల్ల శత్రువులుగా మారాల్సి వస్తుంది. అసలు ఈ గొడవలో మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) పాత్ర ఏమిటి? ఆయన ఈ గొడవలను ఎలా ఆపాడు? అనేది “లాల్ సలామ్” కథాంశం.

నటీనటుల పనితీరు: రజనీకాంత్ పాత్ర కాస్త కొత్తగా ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ ఆర్క్ అనేది సరిగా లేకపోవడం వల్ల.. సరిగా వర్కవుటవ్వలేదు. విష్ణు విశాల్, విక్రాంత్, తంబి రామయ్యలు కాస్త ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు కానీ.. సెంటిమెంట్ సీన్స్ లో బాగా మరిగిన సాంబార్ ను మన తెలుగు ప్రేక్షకులు రుచించుకోవడం కాస్త కష్టమే. తంబి రామయ్య మాత్రం కొన్ని సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. మిగతా క్యాస్టింగ్ అందరూ పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ సంగీతం, ప్రవీణ్ భాస్కర్ కెమెరా పనితనం బాగున్నప్పటికీ.. కనీస స్థాయి ఆసక్తి లేని కథనం వల్ల అవి ఎలివేట్ అవ్వలేదు. ఇకపోతే.. ఎస్.ఎఫ్.ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. ఆర్క్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ ను ఎలివేట్ చేశాయి. అయితే.. అసలు తప్పంతా రచయిత-దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ దే. ఏదో తండ్రి రజనీకాంత్ ఫ్రీగా నటిస్తున్నాడు కదా అని కథ-కథనం, సన్నివేశాల రూపకల్పన విషయంలో కనీస స్థాయి కేర్ తీసుకోలేదు. భీభత్సమైన ఎమోషన్ పండాల్సిన సన్నివేశంలో ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు అంటే..

రైటింగ్ అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా.. రజనీకాంత్ రక్తంతో తడిసిన కత్తిని చూపిస్తూ “ఇది ఏ మతస్తుడి రక్తం” అనే సన్నివేశం చాలా పేలవంగా ఉంది. ఇదే తరహా సన్నివేశం మణిరత్నం “బాంబే”లో చూసినప్పుడు మంచి ఆలోచింపజేస్తుంది, అదే సన్నివేశం రీసెంట్ గా వచ్చిన “ప్రిన్స్” సినిమాలో హిలేరియస్ ఫన్ జనరేట్ చేసింది. కానీ.. “లాల్ సలామ్”లో అదే తరహా సన్నివేశం మంచి ఎమోషన్ పండించకపోగా, హాస్యాస్పదంగా తెరకెక్కించడం అనేది ఐశ్వర్య పనితనానికి ప్రతీక.

విశ్లేషణ: రజనీకాంత్ మీద విపరీతమైన అభిమానం, థియేటర్లో కూర్చునే ఓపిక, సహనం వంటివి ఎంత పుష్కలంగా ఉన్నా “లాల్ సలామ్” (Lal Salaam) చిత్రాన్ని రెండున్నర గంటలపాటు థియేటర్లో చూడడం కష్టమే. అసలు నిర్మాతలు ఈ సినిమాని తెలుగులో ఎందుకు ప్రమోట్ చేయలేదో, థియేటర్ల నుండి బయటకు వస్తున్నప్పుడు అర్ధమవుతుంది.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #jeevitha
  • #Lal Salaam
  • #Rajinikanth
  • #Senthil

Reviews

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

Kamal – Rajini: ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేసిన కమల్‌ హాసన్‌.. తలైవాతో..

trending news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

1 hour ago
Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

2 hours ago
Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

2 hours ago
OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

5 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

6 hours ago

latest news

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

1 hour ago
Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

2 hours ago
Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

6 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version