Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

ఒక గ్రూపులో ఒకరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. ఆ ఒక్కరే రియాక్ట్ అయితే వచ్చే ప్రభావం కంటే.. మొత్తం గ్రూపు రియాక్ట్‌ అయితే వచ్చే ప్రభావం చాలా ఎక్కువ. ఈ విషయంలో అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన ఈ విషయం సినిమా పరిశ్రమకు చెందిన వారికి తెలియదా? తెలిస్తే రియాక్ట్‌ అవ్వడం లేదా? అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చలో ఉన్న అతి పెద్ద అంశం ‘చుట్టమల్లే ఏఐ వీడియో’. ఈ వీడియో ఎంతటి చర్చకు దారి తీసిందో మీకు తెలిసిందే.

Tollywood

సోషల్‌ మీడియాలో ఎవరో ఒక సభ్యత లేని వ్యక్తి ఆ వీడియోను సిద్ధం చేసి షేర్‌ చేశారో తెలియదు కానీ.. అప్పటి నుండి నెటిజన్లు తెగ షేర్లు కొట్టారు. ఆ తర్వాత ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఎన్టీఆర్‌ వరకు చేరింది. ఆయన వెంటనే రియాక్ట్‌ అయి.. ఈ పనిని ఖండించారు. ఆ వెంటనే చిరంజీవి కూడా విషయంలో రియాక్ట్‌ అయ్యారు. విజయ్‌ దేవరకొండ, ఖుష్బూ సుందర్‌, మంచు విష్ణు కూడా ఈ విషయంలో స్పందించారు. అయితే టాలీవుడ్‌లో ఉన్నది వీరేనా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

జాన్వీ కపూర్‌ విషయంలో ఇప్పుడు జరిగిన పని ఏమంత చిన్నది కాదు. ఇదే పరిస్థితి మరికొంతమంది హీరోయిన్లకు లేదంటే హీరోలకు ఎదురైతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పండి. కానీ ఎందుకో కానీ ఇండియన్‌ సినిమాలో ఇతర ప్రముఖులెవరూ ఈ విషయంలో ఇంకా సరైన రీతిలో స్పందించలేదు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమం రేగాల్సిన అవసరం ఉంది. ‘మీటూ’ ఉద్యమాన్ని మించిన ఉద్యమం ఈ విషయంలో జరగాలి. కానీ ఇంకా ఎవరూ రియాక్ట్‌ అవ్వడం లేదు.

దీంతో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. రియాక్ట్‌ అవ్వండి అని ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూద్దాం ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం.

విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus